అన్వేషించండి

స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి హెలిప్యాడ్‌ వరకు - ప్రపంచంలోనే అతి పొడవైన కారు ‘The American Dream’ అద్భుత ఫీచర్లు

Longest Car In The World: ఈత కొలను, జాకుజీ నుంచి గోల్ఫ్ కోర్స్‌ వరకు ఉన్న ప్రపంచంలోనే అతి పొడవైన కారు ఇది. దీనిని హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు.

World's Longest Limousine The American Dream: స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, గోల్ఫ్ కోర్స్ వంటి అన్నీ ఉన్న కారు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?. అది కలలా లేదా సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలా అనిపించవచ్చు. కానీ అలాంటి కారు నిజంగానే ఉంది. ఒక హెలికాప్టర్ కూడా దానిపై దిగగలదు. 100 అడుగుల పొడవున్న ఈ లగ్జరీ కారు ప్రపంచంలోనే అతి పొడవైన కారు. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది & అభినందనలు అందుకుటుంటోంది.

ప్రపంచంలోనే అతి పొడవైన కారు
'ది అమెరికన్ డ్రీమ్' (The American Dream) ప్రపంచంలోనే అతి పొడవైన కారుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. దీని పొడవు 100 అడుగుల 1.5 అంగుళాలు (సుమారు 30.5 మీటర్లు). వాస్తవానికి దీనిని కారు అనకూడదు, లిమోజిన్‌ (Limousine) అని పిలవాలి. ఈ అద్భుతమైన లిమోజిన్‌ను ఇప్పుడు కాదు, 1986లోనే రూపొందించారు. ప్రఖ్యాత కాలిఫోర్నియా కార్ డిజైనర్ జే ఓర్‌బర్గ్ దీనిని డిజైన్‌ చేశారు. ప్రారంభంలో, దీని పొడవు 60 అడుగులుగా ఉండేది. ఆ తరువాత దానిని 100 అడుగులకు పెంచారు, నేరుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కించారు. నేడు, ఈ కారు USA ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న ఒక ఆటో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారింది.

డిజైన్ & ఇంజినీరింగ్
అమెరికన్ డ్రీమ్ కారు డిజైన్.. లగ్జరీ & ఇంజినీరింగ్‌ అద్భుతమైన కలయికను ప్రదర్శిస్తుంది. ఈ కారుకు 26 టైర్లను బిగించారు. రైలు తరహాలో, ఈ కారుకు రెండు V8 ఇంజిన్లను (ముందు భాగంలో ఒకటి & వెనుక భాగంలో ఒకటి) ఏర్పాటు చేశారు, ఈ ఇంజిన్‌లు ఈ భారీ కారును నడిపించే శక్తినిస్తాయి. ఈ ప్రత్యేకమైన సెటప్ వల్లే ఈ కారు అపారమైన పొడవు & బరువును మ్యానేజ్‌ చేయాడానికి వీలైంది. దీనిని సూపర్ లిమోజిన్ అనే కంటే "చక్రాలపై రాజభవనం" అని కూడా చెప్పవచ్చు. ఇది చాలా పెద్దది కాబట్టి ఒక్క చూపులో పూర్తిగా చూడటం దాదాపు కష్టం. 

హెలిప్యాడ్, జాకుజీ & స్విమ్మింగ్ పూల్
అమెరికన్ డ్రీమ్ కారు ఒక లగ్జరీ హోటల్ లేదా రిసార్ట్ లాంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ కారులో స్విమ్మింగ్ పూల్ & డైవింగ్ బోర్డ్, జాకుజీ (అడుగు నుంచి నీళ్లను పైకి ఎగదోసే నీటి తొట్టె), మినీ గోల్ఫ్ కోర్సు, వాటర్ బెడ్, రిఫ్రిజిరేటర్, టీవీ & టెలిఫోన్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు, 5,000 పౌండ్ల బరువు ఉన్న హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయగల హెలిప్యాడ్‌ను కూడా దీనిపై ఉంది. ఈ లక్షణాలన్నింటి వల్ల ఈ కారును కేవలం వాహనంగా మాత్రమే చూడలేము, ఇది అంతకంటే ఎక్కువ. "ప్రయాణించే లగ్జరీ రిసార్ట్‌"గా కూడా పిలవవచ్చు.

75 మంది ప్రయాణీకులకు సరిపడా స్థలం
అమెరికన్ డ్రీం పొడవైనది మాత్రమే కాదు, చాలా విశాలమైనది కూడా. ఇది ఒకేసారి 75 మందికి పైగా ప్రయాణీకులను ఇది తీసుకెళ్లగలదు. దీని లోపలి భాగం మెరిసే ఫ్లోరింగ్, మెత్తటి సోఫాలు & బంగారు రంగు ఫినిషింగ్‌తో రాయల్ కారిడార్ ఉంటాయి. దీనివల్ల ఈ కారులో అడుగు పెడితే రాజభవనం లోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ కారును కొన్ని విభాగాలుగా విభజించారు. ప్రతి విభాగంలో వాతావరణ నియంత్రణ, వెనక్కు వాలే సీట్లు & మినీబార్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ కారును పెద్ద ఈవెంట్‌లు, వివాహ వేడుకలు & హాలీవుడ్ చిత్రాల కోసం ఉపయోగించారు.

టాప్ హెడ్ లైన్స్

Engine Layout: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!
మీ కారు ఇంజిన్‌ ముందు వైపు ఉందా, మధ్యలో ఉందా.. డ్రైవింగ్‌లో వచ్చే తేడా ఏంటి?
Car Tyre Pressure: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!
టైర్ ప్రెజర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా? మైలేజీ, బ్రేకింగ్, టైర్ లైఫ్‌ మీద ఎంత ప్రభావమో తెలుసా?
Moto Guzzi The Trip: 457cc ఇంజిన్‌, 47.6hp పవర్‌తో కొత్త రెట్రో రెట్రో రోడ్‌స్టర్.. ఫీచర్లు, కలర్ ఆప్షన్లు
బైక్‌ పేరు Moto Guzzi The Trip.. 457cc ఇంజిన్‌తో వస్తున్న కొత్త ఇటలీ మోటార్‌సైకిల్‌
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget