అన్వేషించండి

BMW దెబ్బకు తుక్కుతుక్కైన Porsche కారు - ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు!

Luxury Car News: ముంబై హైవేపై జరిగిన ఒక సంఘటనలో Porsche కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ కారు విలువ కోట్లల్లో ఉంటుంది, సెకన్ల వ్యవధిలో ఆ డబ్బు చిత్తు కాగితంలా మారింది.

Porsche Car Crash On Mumbai Highway With BMW: గత బుధవారం రాత్రి (అక్టోబర్ 8, 2025) ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వే జరిగిందీ సంఘటన. ఒక లగ్జరీ పోర్షే కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే, ఇది అనుకోని సంఘటన కాదు, కావాలనే రిస్క్‌ తీసుకోవడం వల్ల జరిగింది. అసలు విషయంలోకి వద్దా.. గత బుధవారం నాడు, కొందరు యువకులు పోర్స్చే & BMW మధ్య జరిగిన హైస్పీడ్ రేస్‌ పెట్టుకున్నారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుతోంది. వేగం చాలా ఎక్కువగా ఉండటంతో పోర్స్చే కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా నుజ్జునుజ్జయింది. జోగేశ్వరి ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు పోర్షే కారులో వేగంగా దూసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన BMW కారు పోర్స్చే కారును స్వల్పంగా ఢీకొట్టింది. దీని ఫలితంగా, పోర్స్చే కారు బ్యాలెన్స్ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. 

ప్రమాదానికి గురైన పోర్స్చే కారు ఖరీదు ఎంత ఉంటుంది?
మన దేశంలో, పోర్స్చే కార్ల ధరలు రూ. 89.65 లక్షల నుంచి రూ. 3.77 కోట్ల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉన్నాయి. ముంబై హైవేపై ప్రమాదానికి గురైన మోడల్‌ను పోలీసులు అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఇది పోర్స్చే 911 (Porsche 911) లేదా పోర్స్చే మకాన్ (Porsche Macan) అయి ఉంటుందని భావిస్తున్నారు. 

పోర్స్చే 911 ధర రూ. 2 కోట్ల నుంచి రూ. 3.77 కోట్ల మధ్య ఉంటుంది. 

పోర్స్చే కేయెన్ (Porsche Cayenne) ధర ₹1.39 కోట్ల నుంచి ₹1.94 కోట్ల వరకు ఉంటుంది. 

పోర్స్చే మకాన్ ధర ₹89.65 లక్షల నుంచి ₹1.10 కోట్ల మధ్య ఉంటుంది. 

ఎలక్ట్రిక్ పోర్స్చే టైకాన్ (Porsche Taycan) ధర ₹1.70 కోట్ల నుండి ₹2.69 కోట్ల మధ్య ఉంటుంది. 

పోర్స్చే పనామెరా ‍‌(Porsche Panamera) ధర ₹1.71 కోట్ల నుండి ₹2.33 కోట్ల మధ్య ఉంటుంది. 

ఈ మోడళ్లన్నీ శక్తివంతమైన ఇంజిన్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు & హై-స్పీడ్ పనితీరును కలిగి ఉంటాయి.

పోర్స్చే కార్లలో అల్ట్రా లగ్జరీ ఫీచర్లు 
పోర్స్చే కారు అంటేనే సంపదకు గుర్తు. విలాసవంతమైన ఇంటీరియర్స్, స్పోర్టీ డిజైన్ & పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌కు ఈ కార్లు బాగా పాపులర్‌. ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, ట్రాక్షన్ కంట్రోల్ & ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) సహా చాలా సేఫ్టీ ఫీచర్లు ఈ కార్లలో ఉంటాయి. హెడ్స్‌-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, టైప్-సి పోర్ట్‌లు & ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఆధునిక లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే, కారు ఎంత సురక్షితమైనదైనా... వేగం & రేసింగ్ వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రాణాంతకం కావచ్చు.

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎదురయ్యే అతి పెద్ద శత్రువు వేగమే అని ముంబై హైవే ప్రమాదం మరోసారి రుజువు చేసింది. కోట్ల రూపాయల విలువైన లగ్జరీ పోర్షే కారు కొన్ని సెకన్లలోనే తుక్కుగా మారింది, ఇక దానిని పాత ఇనుప సామాను కింద అమ్మేయాల్సిందే. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై సమాచారం లేదు.

టాప్ హెడ్ లైన్స్

Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Embed widget