అన్వేషించండి

Bandi Sanjay vs Mynampally: బండి సంజయ్.. నువ్వు ఓ బచ్చా.. ఎమ్మెల్యే మైనంపల్లి బూతు పురాణం.. గలీజు మాటలతో నేతల రచ్చ

బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంతని ఒకరినొకరు ఏకంగా బూతులు తిట్టుకునే స్థాయికి వ్యవహారం వెళ్లింది.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మల్కాజ్‌గిరిలో జెండా వందనం సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు మరింత వేడి రాజేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంతని ఒకరినొకరు ఏకంగా బూతులు తిట్టుకునే స్థాయికి వ్యవహారం వెళ్లింది. ఆదివారం ఏకంగా ఇరువురు నేతలు వేర్వేరుగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ మీడియా ముందే అసభ్య పదజాలంతో బూతులు మాట్లాడేశారు.

Also Read: Bhadradri Kothagudem: బర్రెతో మరో వ్యక్తి లైంగిక చర్య.. స్థానికుల కంటపడ్డ దృశ్యం, ఈడ్చుకొచ్చి.. చివరికి..

వివాదానికి మూలం ఏంటంటే..
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మల్కాజ్ గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో కార్పొరేటర్ శ్రవణ్ కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించగా.. అక్కడికి బండి సంజయ్, విజయశాంతి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనంపల్లిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే మైనంపల్లిపై బండి సంజయ్ వ్యాఖ్యలివీ..
కార్పొరేటర్ శ్రవణ్‌పై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరులు బీర్ బాటిళ్లతో దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్యే మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి కబ్జా కథలన్నీ బయటకు తీయిస్తానని బండి సంజయ్ హెచ్చరించారు. అతను ఇలాంటి వ్యక్తి అని తెలిసే.. బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదని అన్నారు. గతంలో మైనంపల్లి తన చుట్టూ తిరిగారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పోలీసుల ముందు దాడి చేస్తుంటే వారు ఎవరికి కొమ్ము కాస్తున్నారని, మహిళలపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని నిలదీశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ శ్రావణ్‌పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Banjara Hills: ఇంట్లో నుంచి వెళ్లిపో.. లేదంటే రేప్ చేయిస్తా..! కూతురుకి కన్న తండ్రి బెదిరింపులు..

‘గుండూ..’ అంటూ మైనంపల్లి వ్యక్తిగత విమర్శలు
దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అదే స్థాయిలో ఘాటు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్.. నువ్వు బచ్చా.. అంటూ మైనంపల్లి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ‘‘కొడకా.. గుండు..’’ అనే పదాలు వాడుతూ బూతులు మాట్లాడారు. తన సామాజిక సేవ ముందు బండి సంజయ్ బతుకెంత అంటూ ఎద్దేవా చేశారు. ఇంకోసారి మల్కాజ్‌గిరిలో అడుగుపెడితే బండి గుండు పగులుతుందంటూ హెచ్చరించారు. ఆ గుండుకి దమ్ముంటే తన ముందుకొచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. అంతేకాక, బండికికి మాట కూడా సరిగ్గా రాదంటూ మైనంపల్లి వ్యక్తిగత విమర్శలు చేశారు. త్వరలోనే బండి సంజయ్ రాసలీలలు బయటపెడతానంటూ మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..

టీఆర్‌ఎస్ కార్యకర్తలు మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి చేయలేదని, నిజాలు గుర్తించి మాట్లాడాలని హితవు పలికారు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎంపీకి తక్కువ అంటూ మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవా చేశారు. ఆయన గతంలో కౌన్సిలర్‌గా ఓడిపోయారంటూ గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్, మైనంపల్లి మధ్య మొదలైన ఈ వాగ్యుద్ధంతో టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఇతర నాయకులు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.

Watch: జెండా ఎగరేస్తుండగా కొట్టుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు.. ఆస్పత్రి పాలైన బీజేపీ నేత

Also Read: Weather Updates: నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లోనే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Simran: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?
MI vs CSK: ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
ముంబైతో మ్యాచ్.. సీఎస్కేదే ఫస్ట్ బ్యాటింగ్, రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే
Kakinada DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ గిరి కోసం ఎందుకంత పోటీ..? రేసులో టిడిపి, జనసేన నేతలు
Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Embed widget