News
News
X

Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..

వనపర్తి జిల్లాలో మూగజీవాలపై అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి చివరికి ఆ పని చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో కాలంగా అతను ఈ పని చేసేవాడని గ్రామస్థులు తెలిపారు.

FOLLOW US: 

కామంతో కళ్లు మూసుకుపోయిన వారు కనీసం వావివరసలు తెలియకుండా ప్రవర్తించి ఆకృత్యాలకు పాల్పడ్డ ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. మానవత్వం లేని కామ పిశాచులు రాక్షసుల్లాగా ప్రవర్తించి అయిన వాళ్ల మీద, ఆఖరికి పసి పిల్లలని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా గేదెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే ఆశ్చర్యకర రీతిలో చనిపోయాడు. ఈ వికృత చేష్ట వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లాలో మూగజీవాలపై అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి చివరికి ఆ పని చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో కాలంగా అతను ఈ పని చేసేవాడని గ్రామస్థులు తెలిపారు. అయితే, తాజాగా అతను అదే పని చేస్తూ చనిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎన్నోసార్లు ఇలా గేదెలు, ఆవులపై అఘాయిత్యానికి పాల్పడుతూ దొరికిపోయినట్లు వెల్లడించారు. గ్రామస్తుల చేతిలో చావు దెబ్బలు తిన్న అతడు మళ్లీ అదే పని చేసేవాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రాణాలనే కోల్పోయాడు. 

Also Read: Jagitial: పెద్దపులిని చూపిస్తానని ఆశపెట్టి పిల్లల్ని తీసుకెళ్లిన తల్లి.. ఏడుస్తూ తిరిగొచ్చిన చిన్న కొడుకు.. గ్రామస్తులు షాక్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరానికి చెందిన ఆంజనేయులు అనే 45 ఏళ్ల వ్యక్తి వ్యవసాయ కూలీ పని చేస్తుంటాడు. కూలీపని పైనే అతను జీవిస్తుంటాడు. అతను ఇటీవల ఓ గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతూ గ్రామంలోని పలువురికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో గ్రామస్తులు ఇతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేసి గట్టిగా హెచ్చరించి వదిలేశారు.

అయితే, ఇంత జరిగాక కూడా అతను తన దుర్భుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ శనివారం బాల్ రెడ్డి అనే రైతు ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న గేదెపై అత్యాచారం చేయబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గేదె తోక మెడకు బిగుసుకోవడం వల్ల ఉరి ఏర్పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతను నగ్నంగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఉదయం పశువుల కొట్టంలో ఆంజనేయులు విగత జీవిగా నగ్నంగా కనిపించడంతో బాల్ రెడ్డి ఆందోళనతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిపాడు. వారంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆంజనేయులు కుటుంబసభ్యులకు అప్పగించారు.

Also Read: Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పలుమార్లు మూగజీవాలపై అత్యాచారానికి పాల్పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఇందుకోసమే గేదెల కొట్టంలోకి వెళ్లి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గేదె తోక మెడకు చుట్టుకొని పడిపోయి ఉన్న ఫోటోలను స్థానికులు తీశారు. ఆ సమయంలో అతను నగ్నంగా ఉన్నాడు. దీంతో పోలీసులు అత్యాచారం చేసే క్రమంలోనే చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆంజనేయులకు మానసిక స్థితి సరిగా లేదని అతడి సోదరుడు తెలిపాడు. గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని, తాము విడిపించుకొని వచ్చినట్లుగా చెప్పాడు.

Also Read: Telangana Gadwal News: భార్యపై అనుమానం.. కొండ అంచున సెల్ఫీ డ్రామా.. భర్త మాస్టర్ ప్లాన్, చివరికి ఏమైందంటే!

Must See: In Pics: చూపుతిప్పుకోనివ్వని చార్మినార్, మూడు రంగుల లైట్లతో ముస్తాబు.. ఇలా ఎప్పుడూ చూసుండరు!

Published at : 15 Aug 2021 09:23 AM (IST) Tags: Rape on Buffalo man sex with Buffalo Wanaparthy Buffalo news Wanaparthy News

సంబంధిత కథనాలు

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

Mla Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసు, దాడికి అసలు కారణమిదే?

Mla Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసు, దాడికి అసలు కారణమిదే?

Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ

Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ

Murder in Ghaziabad: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ- చివరికి ట్విస్ట్!

Murder in Ghaziabad: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ- చివరికి ట్విస్ట్!

Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!

Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్‌ విషయంలో సజ్జల క్లారిటీ

Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్‌ విషయంలో సజ్జల క్లారిటీ

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!