By: ABP Desam | Updated at : 16 Aug 2021 08:03 AM (IST)
వాతావరణం (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేశారు.
Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!
ఈ జిల్లాల్లోనే అతిభారీ వర్షాలు
ఆగస్టు 15 రాత్రివేళ హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఆగస్టు 16న తెలంగాణలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కరీంనగర్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ పట్టణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. ఇక మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసేటట్లుగా అంచనా వేశారు. భారీ వర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
Also Read: Gold-Silver Price: బంగారం ధరలో అతి స్వల్ప పెరుగుదల.. నిలకడగా వెండి ట్రేడింగ్.. ఇవాల్టి ధరలివే..
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి
Breaking News Live Updates : డ్రాగా ముగిసిన భారత్, పాకిస్తాన్ హాకీ మ్యాచ్
Renuka Chowdhury : మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై కేసు నమోదు, వైద్యుడి సతీమణి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్!
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?