By: ABP Desam | Updated at : 16 Aug 2021 07:25 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో చెన్నై, ముంబయి, బెంగళూరు సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే ఉంటున్నాయి. హైదరాబాద్‌లోని ఇంధన మార్కెట్‌లో మూడు రోజుల క్రితం పెరిగిన స్వల్పంగా హెచ్చుతగ్గులు చోటు చేసుకున్న ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి.
తెలంగాణలో ఆగస్టు 16న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 గానే కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.97.96 గా స్థిరంగానే ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్‌లో రూ.105.71గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.83 గా ఉంది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.41 కాగా.. డీజిల్ ధర రూ.97.55 గా ఉంది. కొద్దిరోజులుగా వరంగల్‌లో నిలకడగా ఉంటున్న ధరలు ఇవాళ మాత్రం అతి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ మూడు పైసలు, డీజిల్ రెండు పైసలు చొప్పున పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధరలో లీటరుకు సుమారు రూ.0.32 పైసల చొప్పున తగ్గింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.30 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.39 గా ఉంది. డీజిల్ ధర రూ.99.40గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.18 పైసలు తగ్గింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.03 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.16 పైసలు తగ్గి రూ.99.62కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.04గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే అతి స్వల్పంగా రూ.0.07 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.06 పైసలు తగ్గి రూ.98.65గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటుండగా.. తాజాగా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తిరుపతిలో భారీ మార్పు
తిరుపతిలో ఇంధన ధరల్లో రోజూ భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.1.25 తగ్గగా.. డీజిల్ రూ.1.12 దిగజారింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.107.59కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.99.19గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 16 నాటి ధరల ప్రకారం 67.50 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
Also Read: Gold-Silver Price: బంగారం ధరలో అతి స్వల్ప పెరుగుదల.. నిలకడగా వెండి ట్రేడింగ్.. ఇవాల్టి ధరలివే..
Also Read: Telangana News: వీళ్లందరికీ కేసీఆర్ శుభవార్త, ఉద్యమంలా తీసుకుపోదామని గోల్కొండ వేదికగా సీఎం వెల్లడి
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>