Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Allari Naresh New Movie: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బచ్చల మల్లి' టీజర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ ట్రాక్ మార్చి, యాక్షన్ తో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'బచ్చల మల్లి' అనే యాక్షన్ మూవీతో సినిమా లవర్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
నరేష్ ఉగ్రరూపం... యాక్షన్ సినిమాతో వస్తున్న అల్లరోడు
అల్లరి నరేష్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'బచ్చల మల్లి'. ఈ మూవీ హాస్య మూవీస్ పతాకం మీద రూపొందుతోంది. బాలాజీ గుత్తా, రాజేష్ దండ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్లలో జోరు పెంచారు. తాజాగా 'బచ్చల మల్లి' మూవీ టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి
అల్లరి నరేష్ అభిమానులకు ఒక రోజు ముందుగానే ఈ అప్డేట్ ఇచ్చి వాళ్లతో పాటు మూవీ లవర్స్ ను అలర్ట్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏఏఏ సినిమా స్క్రీన్ 1లో నిర్వహించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ టీజర్ రానే వచ్చింది. 'బచ్చల మల్లి' టీజర్ లో అల్లరి నరేష్ నట విశ్వరూపం కనిపించింది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా, ఈ మూవీతో అల్లరి నరేష్ మరోసారి 'నాంది' మూవీ లాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది. రగ్డ్ అండ్ రస్టిక్ లుక్ లో అల్లరి నరేష్ టీజర్ లో కనిపించగా, బిజీఎమ్ కూడా బాగుంది. మొత్తానికి టీజర్ సినిమాపై బజ్ బాగానే క్రియేట్ చేసింది.
Our #BachhalaMalli aka @allarinaresh arrived at the teaser launch event in style 🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 28, 2024
Watch Live Now!https://t.co/7SKzDZQYT8
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 20th.@Actor_Amritha @subbucinema @RajeshDanda_ @_BalajiGutta @ChotaKPrasad @richardmnathan @brahmakadali… pic.twitter.com/E4xd1YXAw7
Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లరి నరేష్ సరికొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు టీజర్ తో మొదలైన ప్రమోషనల్ కార్యక్రమాల్లో మరింత జోరు పెంచబోతున్నారు మేకర్స్. త్వరలోనే ట్రైలర్ ను కు రిలీజ్ చేయనున్నారు. 'బచ్చల మల్లి' సినిమాలో యూనీక్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న అల్లరి నరేష్... ఈసారి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి. 'నాంది' సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన అల్లరి నరేష్... ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగా' సినిమాలో కీలక పాత్ర పోషించారు అల్లరి నరేష్.
Also Read: పుష్ప 2 చూసిన అల్లు అరవింద్... ఆయన రియాక్షన్, రివ్యూ ఏమిటంటే?