Pushpa 2: పుష్ప 2 చూసిన అల్లు అరవింద్... ఆయన రియాక్షన్, రివ్యూ ఏమిటంటే?
Allu Aravind watches Pushpa 2: 'పుష్ప 2' ఫస్ట్ కాపీ రెడీ అయిందని తెలిసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆయన తండ్రి అల్లు అరవింద్ కోసం స్పెషల్ షో వేశారట. మరి వాళ్ల రివ్యూ ఏమిటో తెలుసా?
Allu Aravind reviews Pushpa 2: 'పుష్ప 2' ఫీవర్ ఒక రేంజ్ దాటింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తీసిన సినిమా మీద రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫిలిం నగర్ వర్గాలు ఏమని అంటున్నాయి? అనే వివరాల్లోకి వెళితే...
అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీ!
అల్లు అర్జున్ (Allu Arjun)తో పాటు ఆయన తండ్రి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఇంకా విద్యా కొప్పినీడి ('ఆయ్' సినిమా నిర్మాతలలో ఒకరు, అల్లు అర్జున్ కజిన్) బుధవారం ఉదయం 'పుష్ప 2' సినిమా చూశారని తెలిసింది.
'పుష్ప 2' చూసిన తర్వాత అల్లు అరవింద్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారట. సినిమా చాలా బాగుందని, తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని సన్నిహితులతో చెప్పారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి.
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా, శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 25న సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. ఆ రోజే షూటింగ్ అంతా పూర్తి చేశారు. ఒక వైపు షూటింగ్ చేస్తూనే... మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను సుకుమార్ అండ్ టీం పర్యవేక్షించింది. ఈ రోజు అల్లు ఫ్యామిలీకి ఫస్ట్ కట్ చూపించారని తెలిసింది. కొంత సౌండ్ మిక్సింగ్, చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ వంటివి ఉన్నాయని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. అవి పూర్తి చేసి మూడు నాలుగు రోజుల్లో ఫైనల్ కాపీని డిస్ట్రిబ్యూటర్లకు ఓవర్సీస్ మార్కెట్లకు పంపిస్తారని సమాచారం.
Also Read: అమెరికా అమ్మాయితో సుబ్బరాజు పెళ్లైపోయిందోచ్... 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు
యాక్షన్ ఎక్కువ... ఎమోషన్ తక్కువ!
'పుష్ప 2' భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ విషయం వచ్చే సరికి దర్శకుడు సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సినిమా యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పుష్పతో పాటు సినిమాలో మిగతా క్యారెక్టర్ల గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. పుష్ప ప్రపంచం కొత్త కాదు... ఆ ప్రపంచంలో పుష్ప ఏం చేశాడు? అనేది ఇప్పుడు కొత్త పాయింట్.
'తగ్గేదే లే...' అని 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చెబితే... సీక్వెల్ (Pushpa 2) వచ్చే సరికి 'అసలు తగ్గేదే లే' అని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే సుక్కు యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారట. ఇంతకు ముందు ఎప్పుడూ సుకుమార్ సినిమాలలో లేనంత భారీగా యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప 2' సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు సునీల్ అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, జగదీష్ ప్రతాప్ బండారి తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. నేపథ్య సంగీతం వచ్చే సరికి ఆయనతో పాటు తమన్, సామ్ సిఎస్ కూడా అందిస్తున్నారనేది అందరికీ తెలిసిన రహస్యమే.