Telangana Assembly: నాలుగో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు, ఈ రోజు రెండు బిల్లులపై చర్చ
రెండు రోజుల సమావేశాల తర్వాత మూడు రోజులు వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం జరిగాయి. మళ్లీ రెండు రోజుల విరామం తర్వాత ఈ రోజు సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రశ్నలేంటంటే..
రెండు రోజుల విరామం తర్వాత రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత నాలుగో రోజు సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడతారు. అనంతరం ఉభయ సభల్లో తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ నిబంధనలు–2019కి సవరణలకు సంబంధించిన పత్రాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమర్పిస్తారు. శాసనసభలో ‘రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలు’, ‘హైదరాబాద్ పాత నగరంలో అభివృద్ధి’పై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. స్వల్పకాలిక చర్చ అనంతరం గత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ బిల్లుల ఆమోదం కోసం చర్చించనున్నారు. దళితబంధు పథకం, హైదరాబాద్‌లో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం, హైదరాబాద్‌లో దోమలు- ఈగల బెడద, రాష్ట్రంలో వంతెనల మంజూరు, షాద్‌నగర్‌కు ఐటీఐ తరలింపు అంశాలు ఈ రోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.
శుక్రవారం అసెంబ్లీ ఆమోదించిన పంచాయతీరాజ్, గృహనిర్మాణసంస్థ, నల్సార్, ఉద్యానవన విశ్వవిద్యాలయం చట్టసవరణ బిల్లులపై మండలిలో చర్చ జరగనుంది. శాసనమండలిలో 4 బిల్లులను చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021ను వేముల ప్రశాంత్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లును నిరంజన్ రెడ్డి, ది నేషనల్ అకాడమీ ఆఫ్ లెగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లు ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి , తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చించి ఆమోదానికి పెట్టనున్నారు.
సెప్టెంబర్ 24న శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు మొదలుకాగా.. రెండు రోజులు మాత్రమే జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు 27వ తేదీన స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. మళ్లీ 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం సమావేశాలు జరిగాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలి భేటీలకు విరామం రావడంతో తిరిగి మళ్లీ ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించే పక్షంలో 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
Also Read:మొబైల్ యాక్సెసరీలపై సూపర్ ఆఫర్లు.. రూ.49 నుంచే ప్రారంభం!
Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా లీక్.. బడాబాబుల ‘విదేశీ’ గుట్టురట్టు.. భారతీయ ప్రముఖులు కూడా!
Also Read: తెలంగాణలో ఉక్కపోత.. ఏపీలో మరో ఐదు రోజులు పిడుగులు పడే అవకాశం
Also Read:స్వల్పంగా పెరిగిన పసిడి.. వెండి నిలకడగా.. మీ నగరంలో నేటి ధరలివే..