అన్వేషించండి

KTR Comments: ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, మంత్రి కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Congress Complaint Against KTR To CEC: మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Complaint Against KTR To CEC: 
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లను డబ్బులు తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని చార్జెడ్ అకౌంటెంట్, కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాలని, మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఓటర్లను ప్రోత్సహిస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏ పార్టీ నుంచి డబ్బు తీసుకున్నా సరే, ఓటు మాత్రం బీఆర్ఎస్‌ పార్టీకి వేయాలని ఓటర్లకు కేటీఆర్ సూచిస్తున్నారని వెల్లడించారు. ఈ ఫిర్యాదు పరిశీలించి, మూడు రోజుల్లోగా మూడు రోజుల్లోగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదు లేఖలో ఈసీని వేణుగోపాల స్వామి కోరారు. 3 రోజుల్లో చర్యలు తీసుకోని పక్షంలో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని లేఖలో ఆయన స్పష్టం చేశారు.

KTR Comments: ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, మంత్రి కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ప్రజాస్వామ్యాన్న అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. డబ్బులు వేరే పార్టీల వద్ద తీసుకుని, ఓట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయాలని ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల జరిగిన సభలలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓట్లు మాత్రం తమకు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడితే, రాష్ట్రంలో అభివృద్ధి మరో స్థాయికి వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలపై ఇతర పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పంచాలని, ప్రజలు పైసలు తీసుకుని ఓట్లు వేయాలని చెప్పడం ప్రలోభాలకు గురిచేయడమేనని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget