అన్వేషించండి

Harish Rao: సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు, మంత్రి హరీష్ రావు వెల్లడి

కాంగ్రెస్ నాయకుల బోగస్ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని హరీష్ రావు స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ త్వరలోనే బిఆర్ఎస్ మేనిఫెస్టోని విడుదల చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను బుధవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తూఫ్రాన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారని మంత్రి అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, కేసీఆర్‌కు ముందు, ఆయన వచ్చాక పట్టణంలో ఏం జరిగిందో మీరే బేరీజు వేసుకోవాలన్నారు. ఇంత పురోగతి కనిపిస్తున్నా ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అంటున్నారన్నారు. తూప్రాన్ అభివృద్ధి కాలేదంటే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టేనని.. ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేమని అన్నారు.

పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్‌ను ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని, తిడుతున్న ప్రతిపక్షాలు కావాలా?.. లేక సంక్షేమం రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్ కావాలా? అని మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలు తిప్పికొట్టాలంటే.. ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలన్నారు.

కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టమని, ఆయన ప్రాతినిధ్యంవల్లే గజ్వేల్ రూపు రేఖలు మారిపోయాయన్నారు. అందుకే ఆయనను అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలని మంత్రి పిలుపిచ్చారు. సిద్దిపేట కంటే ఎక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దామన్నారు. అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రధాని మోదీ కాపీ కొట్టారని హరీష్ రావు విమర్శించారు. తమ ప్రభుత్వం బీసీలకు ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అప్పుగా ఇస్తుందన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పలు విమర్శలు గుప్పించారు.  50 ఏళ్లలో చైన్ అభివృద్ధిని ఇప్పుడు చేస్తామని కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లు రాసి ఇస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కానీ తెలంగాణ ప్రజలకు వారంటీ, గ్యారంటీ సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిత్యం కరెంటు కోతలేనని కెసిఆర్ హయాంలో నిమిషం కూడా కరెంటు పోవడం లేదని వెల్లడించారు. 

మళ్లీ పాత రోజులు వస్తున్నాయని ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోందని హరీష్ రావు అన్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ నీ పక్కకు పెడుతూ మట్టి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.  గద్దెనెక్కే వరకు కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడతారని మంత్రి హరీశ్​రావు అన్నారు.  కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో చేయలేని వారు.. తెలంగాణలో మాయమాటలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. 

కాంగ్రెస్ నాయకుల బోగస్ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని హరీష్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలకు పోటీ జరగబోతుందని పేర్కొన్నారు. గద్దినెక్కేవరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి అబద్ధాల నైన మాట్లాడతారని హరీష్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

 కర్ణాటకలో చేయలేని వారు తెలంగాణలో మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారెంటీలు కాదు ఆరు నెలలకు సీఎం వస్తారని ఎద్దేవా చేశారు. అలాగే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు కర్ఫ్యూ హైదరాబాదులో వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ది తన్నుల సంస్కృతి అని బీఆర్ఎస్ ది టన్నుల సంస్కృతి అని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget