News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM KCR: మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్ భేటీ - ఐటీ, ఈడీ దాడులపై ఏం చేయాలో చర్చలు!

CM KCR: సీఎం కేసీఆర్ మంగళవారం రోజు పలువురు మంత్రులు, నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులపై ఏం చేయాలో చర్చించుకున్నారు.

FOLLOW US: 
Share:

CM KCR: మంగళవారం రోజు పలువురు మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఆదాయ పన్ను శాఖల వరుస దాడులపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన విద్యాసంస్థల్లో సోదాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు. మంత్రి మల్లారెడ్డితో సీఎం ఫోన్ లో మాట్లాడి, ధైర్యం చెప్పారని తెలిసింది. కేంద్రం వైఖరిపై సీఎం సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కేంద్ర సంస్థల దాడుల సమాచారాన్ని సేకరించి, వాటి పూర్వాపరాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

కేసినో కేసుతో ప్రారంభించి.. ఐటీ దాడుల వరకూ ! 

చీకోటి ప్రవీణ్ కేసినో కేసు అంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ తిరుగుతోంది. ఆయన సోదరులను ... పీఏను ప్రశ్నించారు. కుమారుడికీ నోటీసులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. పాటు తాజాగా మల్లారెడ్డి ఇంటిపై దాడులు చేశారు. మల్లారెడ్డి వ్యాపార వ్యవస్థపై ఏకంగా యాభై బృందాలతో దాడులు చేశారు అధికారులు.  మల్లారెడ్డి చేసే వ్యాపారాల్లో ఎన్నో లొసుగులు ఉంటాయని.. వాటిని ఐటీ సులువుగా పట్టుకోగదలని అంటున్నారు. రేపు ఎవరిపై చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా మంది ఐటీ, ఈడీ రాడార్‌లో ఉండాలని జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. తుడిపేసుకోలేని వ్యవహారాలు ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి బయటకు వస్తూంటాయి. దీంతో ఆయా నేతలకు టెన్షన్ మాత్రం తప్పడం లేదు. 

రేపు టార్గెట్ అయ్యే నేత ఎవరు ? 
 
ఇది బిగినింగ్ స్టేజేనని.. టీఆర్ఎస్ ఆర్థిక మూల స్తంభాలుగా ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతాయని భావిస్తున్నారు. గతంలో రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేసినప్పుడు చాలా వరకూ సమాచారం సేకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా చేసిన సోదాల్లోనూ మరిన్ని వివరాలు సేకరించారు. గత ఎన్నిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆర్ధికంగా స్థిరపడ్డారు. వారందరిపై ఐటీ, ఈడీలు దృష్టి పెట్టడం ఖాయమని చెబుతున్నారు.  ఎంత పారదర్శకంగా వ్యవహారాలు నడిపినా..ఏదో ఓ లొసుగు బయటపడితే దొరికిపోతామని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్ మైనింగ్ కేసే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. గ్రానైట్ మైనింగ్ లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వ్యాపారం ఎవరూ చేయలేరని.. కొన్ని కొన్ని చోట్ల ప్రభుత్వం చూసీ చూడకుండా పోతుందని. ..దాన్నే నేరగా ఇప్పుడు ఈడీ, ఐటీ చూపిస్తున్నాయని నేతలంటున్నారు. అందుకే సోదాలంటేనే వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో కలిసి ఏం చేయాలనే అంశంపై చర్చించారు. 

రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటు అయింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పోతంగల్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. పోతంగల్ తో పాటు మరో 13 గ్రామాలను దీని పరిధిలో చేర్చింది. దీనిపై శాసన సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

Published at : 23 Nov 2022 08:25 AM (IST) Tags: CM KCR Pragathi Bhavan CM KCR Meeting With Ministers CM KCR Meeting With Leaders ED And IT Attacks

ఇవి కూడా చూడండి

Kishan Reddy on Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలా! క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Kishan Reddy on Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలా! క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

RS Praveen Kumar: 'మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి పెను భారం' - ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్న బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar: 'మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి పెను భారం' - ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్న బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

MLA Yashaswini Reddy Dance Video: విజయోత్సవ ర్యాలీలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వీడియో వైరల్

MLA Yashaswini Reddy Dance Video: విజయోత్సవ ర్యాలీలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వీడియో వైరల్

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు