అన్వేషించండి

Turmeric Board: పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేయడం లేదా? నోటిఫికేషన్‌లో ఎక్కడా కనిపించని తెలంగాణ పదం

Turmeric Board: పసుపు బోర్డు ప్రకటిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో తెలంగాణ పేరు ఎక్కడా లేకపోవడంతో.. అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Turmeric Board: రాష్ట్ర రైతుల చిరకాల డిమాండ్ పసుపు బోర్డు. పసుపు బోర్డు కావాలని చాలా కాలం నుంచి నిజామాబాద్ రైతులు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జాతీయ పసుపు బోర్డుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పసుపు బోర్డు ప్రకటిస్తూ కేంద్ర సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

అయితే ఈ గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర రైతుల్లో ఆనందం నింపాల్సింది పోయి.. అనుమానాలను రేకెత్తించింది. ఎందుకంటే ఈ గెజిట్ నోటిఫికేషన్ పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని ఎక్కడా పేర్కొనలేదు. అసలు ఆ నోటిఫికేషన్ లోనే ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు. పసుపు బోర్డు మండలి కూర్పు, దాని ఉద్దేశాలు, ఆర్థిక వనరులకు సంబంధించిన విధివిధానాలు, దాని నిర్వహణ, పర్యవేక్షణ వంటివన్నీ పేర్కొన్నారు. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది.. దానికేమైనా ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా.. అన్న వివరాలేవీ పేర్కొనలేదు. ఇందులో ఎక్కడా తెలంగాణ రాష్ట్రం పేరు లేదు.

ఇప్పటికే హైదరాబాద్ లో జాతీయ ఔషధ విద్య, పరిశోధన మండలి (నైపర్) శాఖ ఉన్న విషయం తెలిసిందే.. దానికి బదులు గువహటిలోని నైపర్ డైరెక్టర్ ను పసుపు బోర్డులో సభ్యుడిగా నియమించారు. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో ఉంటుందని తెలిపారు. పసుపు బోర్డుకు నిధులు కూడా కేంద్ర సర్కారే సమకూరుస్తుంది. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో సాగుతుంది. 

కేంద్ర విడుదల చేసిన ఈ గెజిట్ నోటిఫికేషన్ తో రాష్ట్ర రైతులకు మరోసారి నిరాశే మిగిలిందని.. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని బీజేపీ చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. పసుపు బోర్డుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో ఎన్నికల జుమ్లా అని తెలిసిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదామంటూ తన పోస్టులో పేర్కొంది. 

పసుపు బోర్డులో ఎవరెవరు ఉంటారంటే..

ఛైర్‌పర్సన్, కార్యదర్శి, నలుగురు సభ్యులు (వ్యవసాయం- రైతు సంక్షేమం, ఆయుష్, ఔషధ మంత్రిశాఖలు- విభాగాలకు చెందిన నలుగురు సభ్యులు), పసుపు ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి ముగ్గురు ప్రతినిధులు (రొటేషన్ పద్ధతిలో), ముగ్గురు పసుపు రైతులు, పసుపు ఆధారిత ఉత్పత్తుల ఎగుమతిదారుల నుంచి ఇద్దరు సభ్యులు, సుగంధద్రవ్యాల బోర్డు కార్యదర్శి, కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ డైరెక్టర్, గువాహటిలోని నైపర్ డైరెక్టర్, జాతీయ ఔషధ మొక్కల బోర్డు సీఈవో లు పసుపు బోర్డులో ఉంటారు. ఛైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం మూడేళ్లు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ బోర్డు కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అన్ని సమావేశాలూ ఛైర్‌పర్సన్ నేతృత్వంలో జరుగుతాయి. ఛైర్‌పర్సన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల్లో సీనియర్ వ్యక్తి నేతృత్వం వహిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
CM Revanth Reddy: బాగా పనిచేస్తున్నందుకే తప్పుకోవాలా? - విద్యాశాఖ మంత్రిపై విమర్శలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
బాగా పనిచేస్తున్నందుకే తప్పుకోవాలా? - విద్యాశాఖ మంత్రిపై విమర్శలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Embed widget