Harish Rao Tweets: కాళేశ్వరానికి జాతీయహోదాపై కేంద్రం తప్పుడు ప్రచారం: హరీష్ రావు ఫైర్
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని మంత్రి హరీష్ రావు వరుస ట్వీట్లు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా పై కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. పార్లమెంటులో కేంద్రం ప్రకటపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయ కక్షతోనే ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారని, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి హరీశ్ రావు వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన గతంలో చేసిన విజ్ఞప్తులను జతపరిచారు హరీశ్‌రావు.
హరీష్ రావు ట్వీట్ -1
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవమని ఫస్ట్ ట్వీట్‌లో అన్నారు. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చామని ట్వీట్‌లో పేర్కొన్నారు. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంటులో కేంద్రమంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని అభిప్రాయపడ్డారు.
False propaganda by the BJP party’s Union Minister that Telangana Govt has not submitted proposal for National Project status to Kaleshwaram Project.
— Harish Rao Thanneeru (@BRSHarish) March 17, 2023
Hon’ble CM KCR Garu & me as Irrigation Minister made several representations to @PMOIndia and Minister of Water Resources for… https://t.co/ERVo5rtMZq pic.twitter.com/qDeee9YLXc
హరీష్ రావు ట్వీట్ -2
కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు CWC అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని సెకండ్ ట్వీట్‌లో గుర్తు చేశరు. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్వట్‌లో పేర్కొన్నారు.
హరీష్ రావు ట్వీట్ -3
2018లో TRS ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంటులో ప్రశ్నించగా నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారని మూడో ట్వీట్ చేశారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం BJP పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్-బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టిందని.. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనమని ట్వీట్లో తెలిపారు.
When BRS MP’s had raised issue of national project status to Kaleshwaram in 2018 Parliament sessions, Former Minister for Water Resource Sri Nitin Gadkari ji replied that GoI has no plans to accord national project status to any project in future.
— Harish Rao Thanneeru (@BRSHarish) March 17, 2023
Contrary to his statement GoI… https://t.co/Z4yPsXnVvI pic.twitter.com/gvPTEQRKwA
హరీష్ రావు ట్వీట్ -4
KWDT-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు CWC అనుమతులు ఇచ్చిందని నాలుగో ట్వీట్ చేశారు. న్యాయవిచారణ పూర్తి కాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించిందని ట్వీట్‌లో గుర్తుచేశారు. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదని ట్వట్ చేశారు. ఇది రాజకీయ కక్ష కాదా అని ప్రశ్నించారు.