By: ABP Desam | Updated at : 23 Dec 2021 10:33 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ఢిల్లీలో ఉన్న కారణంగా ఆయన విచారణకు హాజరు కాలేకపోయారని.. విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయి కదా అని కోర్టు ప్రశ్నించింది. సాయంత్రం దాకా జరగడంతో.. రాలేకపోయారని న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఈ కారణంగా విజయసాయిరెడ్డికి విచారణకు హాజరు మినహాయింపునిచ్చింది కోర్టు.
జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్ఛార్జ్ పిటిషన్ పై ఇవాళ విజయసాయిరెడ్డి వాదనలు జరిగాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులపై హైకోర్టులో స్టేటస్ కో ఉన్నందున.. ప్రస్తుత దశలో విచారణ జరపడం తగదని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కేసు కూడా ఇంకా రుజువు కాలేదని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి డిశ్ఛార్జ్ పిటిషన్‌పై విచారణ 30వ తేదీకి వాయిదా పడింది. ఇందూ టెక్ జోన్ లో డిశ్ఛార్జ్ పిటిషన్‌పైనా జగన్ వాదనలు జరిగాయి. ఇందూ టెక్ జోన్‌కు భూమి కేటాయింపు ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమేనని జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు ఈనెల 31కి కోర్టు వాయిదా వేసింది.
విచారణకు హాజరుకాకపోవడంపై..
అక్రమాస్తుల కేసుల విచారణకు సీబీఐ కోర్టుకు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై ఇటీవలే సీబీఐ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ విచారణకు హాజరు కాకపోవడానికి కారణం ఏమిటని జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాం... కోర్టు తీర్పు రావాల్సి ఉంది. అందుకే కోర్టుకు హాజరు కావడం లేదని జగన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాల్సినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఏదో ఓ కారణం చెప్పి గైర్హాజర్ అవుతున్నారు. మంగళవారం జరిగిన విచారణకు కూడా హాజరు కాకపోవడంతో ఈ అంశంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి తాజాగా అసహనం వ్యక్తం చేశారు.
జగన్‌పై అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో శుక్రవారం మాత్రమే జరిగేది. అయితే ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో .. సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. సీఎం అయినప్పటి నుండి జగన్ ఒకటి ..రెండు సార్లు మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టు హాజరు మినహాయింపు ఇవ్వకపోవడంతో తప్పనిసరిగా హాజరయ్యారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. కరోనా కారణంగా చాలా కాలం సీబీఐ కోర్టులో భౌతిక విచారణలు జరగలేదు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్‌డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్!