By: ABP Desam | Updated at : 23 Dec 2021 03:24 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి బొత్స సత్యనారాయణ(ఫైల్ ఫొటో)
సినిమా టికెట్ల రేట్లు తగ్గించి ప్రేక్షకులను ఏపీ ప్రభుత్వం అవమానించిందని హీరో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుందన్నారు. సినిమా థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదని స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టికెట్ల ధరలు నియంత్రిస్తే అవమానించడం కాదన్నారు. సినిమా టికెట్లు ఇష్టానుసారంగా అమ్మితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించమన్నారు. సామాన్యుడికి సినిమా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అని మంత్రి బొత్స అన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమ్ముతామంటే ఎలా అన్నారు. ప్రేక్షకుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అన్నారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : నట్టి కుమార్
ఏపీ సినిమా టికెట్ రేట్లపై మరోసారి వివాదాన్ని రాజుకుంది. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని హీరో నాని చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్ తప్పుపట్టారు. ఏపీలో సినిమా టికెట్ ధరలు, కలెక్షన్స్, షేర్స్ గురించి అవగాహన లేకుండా హీరో నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నాని వెంటనే ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా టికెట్ల ధరల విషయంలో నిర్మాతలు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. కోర్టులో కూడా ఈ వ్యవహారం నడుస్తోంది. సినిమా టికెట్ల రేట్లు, షేర్స్, కలెక్షన్స్ గురించి తెలుసుకోకుండా నాని ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని నట్టి కుమార్ అన్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల మిగిలిన సినిమాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయమే వస్తుందని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్లు మూసివేత
తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలన్న అధికారుల ఆదేశాలతో థియేటర్లను యాజమాన్యాలు మూసివేశాయి. జిల్లాలో 50కి పైగా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పాలి! - నట్టి కుమార్ డిమాండ్
టికెట్ల రేట్లపై హీరో నాని విమర్శలు
టికెట్ రేట్లు తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానించిందని హీరో నాని ఆరోపించారు. టికెట్ రేటు పెంచినా ప్రేక్షకులు కొనగలరని ఆయన అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుందని అంటూనే... థియేటర్ కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని నాని నర్మగర్భంగా మాట్లాడారు. థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్ అని అన్నారు. ప్రస్తుతం రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్‌లో టీ రేటు పది రూపాయలు ఉంది. సినిమా టికెట్ రేటు అంత కంటే తక్కువ అని, మూడు గంటలు కూర్చోబెట్టి సినిమా చూపిస్తే 5 రూపాయలు ఏంటని సాధారణ ప్రేక్షకులు కూడా నోరెళ్ల బెడుతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు కొంత మంది బాహాటంగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకులు అందరికీ తక్కువ రేటులో వినోదం అందుబాటులోకి తీసుకు రావడం కోసమే టికెట్ రేట్లు తగ్గించామని అంటోంది.
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Breaking News Live Updates: నిజామాబాద్ నుంచి కాశీకి యాత్రికుల బస్సు, బిహార్‌లో బోల్తా
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Konaseema News: అమలాపురం ఘటనకి చంద్రబాబు, పవనే కారణం - రాష్ట్రానికి ఏకైక విలన్ ఆయనే: దాడిశెట్టి రాజా
Pinpe Vishwaroop: ఏం చేసినా మమ్మల్ని భయపెట్టలేరు, ప్రభుత్వం వెనక్కి తగ్గదు: మంత్రి విశ్వరూప్ రియాక్షన్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Rajya Sabha Elections 2022: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్‌బై- ఎస్పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
The Gray Man Trailer - ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్: హాలీవుడ్ మూవీలో ధనుష్, మెరుపు తీగలా మాయమయ్యాడంటూ ట్రోల్స్!