Andhra Year Ender 2021 : కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్‌ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?

2021 ఆంధ్రప్రదేశ్‌కు కొంచెం తీపి.. ఎంతో చేదు మిగిల్చింది. రాజకీయ దాడులు..కేసులు..తిట్లు రాజకీయాలను డామినేట్ చేశాయి. సబ్బం హరి, సీతారామశాస్త్రి, రోశయ్య వంటి వారిని తెలుగు ప్రజలు కోల్పోయారు.

FOLLOW US: 

గడిచిపోతున్న కాలం జ్ఞాపకాలను మిగులుస్తుంది. అందులో కొన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునేవి.. కొన్ని అప్పుడప్పుడూ జ్ఞప్తికి తెచ్చేవి ఉంటాయి. కాల గమనంలో మరో ఏడాది కలిసిపోతోంది. 2021 ముగిసిపోతోంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా ఎన్నెన్నో పరిణామాలు జరిగాయి. ఈ ఏడాది మొత్తం ఏపీలో రాజకీయాలు రాజధాని చుట్టూ..  ప్రతిపక్ష నేతలపై కేసుల చుట్టూ తిరిగాయి. రాజకీయ నాయకుల భాష దిగజారిపోయింది. చివరికి ఆడవాళ్లను కించ పర్చడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. అసెంబ్లీలో సవాల్  ఈ ఏడాది పొలిటికల్ హైలెట్‌గా నిలిచింది. అన్నింటినీ గుర్తు చేసుకోలేకపోయినా.. నెల వారీగా ఆ నెలలో జరిగిన ముఖ్య సంఘటనలు వాటి ప్రభావంపై ఇయర్ ఎండర్ రివ్యూ ఇది ! 


Also Read: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!

జనవరి :  స్థానిక ఎన్నికల హడావుడి - ఇన్‌సైడర్ కేసుల కొట్టివేత !

2021 ప్రారంభంలో అత్యధికంగా అందరి నోళ్లలో నానిన అంశం స్థానిక ఎన్నికలు. ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆ వివాదం మొత్తం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఓ వైపు నిమ్మగడ్డ ప్రకటనలు.. మరో వైపు ఆయనపై ప్రభుత్వం తిరుగుబాటు వంటివి ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూ వచ్చాయి. నెలంతా అదే వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధం కాకపోవడం తీవ్ర వివాదాస్పదమయింది. ఇక అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. భూమి అమ్మిన వారెవరూ ఫిర్యాదు చేయకుండానే సీఐడీ కేసు పెట్టడాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రామతీర్థం ఆలయంలో జజరిగిన దురదృష్టకర సంఘన కేంద్రం జనవరిలో ఏపీలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. చంద్రబాబు ఆలయాన్ని పరిశీలించారు. పోటీగా విజయసాయిరెడ్డి వెళ్లారు. విజయసాయిరెడ్డి కారు మీద వాటర్ బాటిళ్లను కొంత మంది విసరడంతో చంద్రబాబును ఏ - వన్‌గా పెట్టి కేసులు పెట్టారు. సీనియర్ నేత కళా వెంకట్రావును రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్లను బాగు చేయడం లేదని ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఓ జనసేన కార్యకర్త రాత్రికి రాత్రి అనుమానాస్పదంగా చనిపోవడం జనవరిలోనేకలకలంరేపింది. 


ఫిబ్రవరి :  పంచాయతీ ఎన్నికల ఘర్షణలు - విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఫర్ సేల్ బోర్డు !

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తంగా సాగాయి. నాలుగు విడతలుగా నిర్వహించడంతో పాటు అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. అనేక మంది అరెస్టయ్యారు. నిమ్మాడలో అభ్యర్థిని బెదిరించారని అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. నిమ్మగడ్డ ద్వివేదీతో పాటు గిరిజాశంకర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ డీవోపీటీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పై మొదటి సారి దాడి జరిగింది.ఆయన కారులో ఉన్న సమయంలో కాపు కాసి దాడి చేశారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదైనా నిందితుల్ని పట్టుకోలేకపోయారు.  ఈ నెలలోనే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఫర్ సేల్ బోర్డు పెట్టారని బయటకు తెలిసింది. దీంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఫిబ్రవరి మొత్తం విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమ వేడి కనిపించింది. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ప్రారంభించారు.అయితే వాహనాలు ఇళ్ల వరకూ రాకపోవడం.. ఎక్కడ వాహనం ఉంటే అక్కడికే వెళ్లి రేషన్ తీసుకోవాల్సి వస్తూండటంతో ఈ పథకం అమలుపై విమర్శలు వచ్చాయి. 


Also Read: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్‌ రోహిత్‌' మర్చిపోలేని 2021

మార్చి :  మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభంజనం - చంద్రబాబుపై రాజధాని కేసులు !

ఏపీలో మార్చిలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉంది. దాడులు.. దౌర్జన్యాలు సహా చాలా జరిగాయి. ్యితే ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి మినహా .. మొత్తం వైఎస్ఆర్‌సీపీ గెల్చుకుంది.   రాజధాని ప్రాంతమైన గుంటూరు,  విజయవాడ నగర పాలక సంస్థల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలి ఉద్ధృతంగా వీచింది. ఇలా ఫలితాలు వచ్చిన వెంటనే... చంద్రబాబుపై ఏపీ సర్కార్ కేసులు పెట్టింది. రాజధాని నిర్ణయాన్ని ముందుగా తన అనుచరులకు చెప్పి.. అక్కడ భూములు కొనుగోలు చేయించారని కేసులుపెట్టారు. ఈ అంశంలో ఆయనను అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. చివరికి హైకోర్టు స్టే ఇచ్చింది. మార్చి నెలలో చంద్రబాబు చిత్తూరుజిల్లాలో పార్టీ కార్యక్రమానికి వెళ్తూండగా..  రేణిగుంట ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పోనివ్వలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఎయిర్‌పోర్టులోనే ధర్నా చేయడం సంచలనం సృష్టించింది. మార్చి నెలలో ప్రముఖ జాతీయ చానల్ ఒకటి వైఎస్ఆర్‌సీపీలో తిరుగుబాటు రానుందని ప్రచారం చేసింది. అయితే అలాంటిదేమీ లేదని సజ్జల ప్రకటించారు.

ఏప్రిల్ :   సీజేఐగా ఎన్వీ రమణ - ధూళిపాళ్ల అరెస్ట్

ఏప్రిల్‌లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీ రమణ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇక కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన ఒకటో తేదీనే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేశారు. దీంతో టీడీపీ ఎన్నికల బహిష్కరణకు నిర్ణయం తీసుకుంది. మరో వైపు తిరుపతి ఉపఎన్నిక కూడా ఈ నెలలోనే జరిగింది. దొంగ ఓటర్లు పోటెత్తడంతో దుమారం రేగింది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్  కూడా ఏప్రిల్‌లోనే వేశారు. ఇక ఏపీ ప్రభుత్వం ధూళిపాళ్ల నరేంద్రనుఅరెస్ట్ చేసింది. సంగం డెయిరీలో అవకతవకల పేరుతో జరిగిన ఈ అరెస్టుల పర్వంలో చివరికి ప్రభుత్వం అనేక విధాలుగా ఎదురు దెబ్బలు తిన్నది. ఇక పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో టిక్కెట్ రేట్లను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివాదం ఇంకా కొనసాగుతోంది.

Also Read: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021

మే :  సబ్బం హరి కన్నుమూత - తిరుపతిలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు - రఘురామ అరెస్ట్

ఏపీలో ప్రముఖ రాజకీయ నేతగా గుర్తింపు పొందిన సబ్బం హరి.. కరోనా కారణంగా మే మొదటి వారంలో కన్నుమూశారు.  తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.  రెండు లక్షల ఇరవై వేల మెజార్టీ లభించింది.  ఏపీ ప్రభుత్వం తిరుపతిలో వచ్చిన గెలుపుతో టీడీపీ నేతలను మరింతగా టార్గెట్ చేసింది.  గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా పరిశ్రమను కాలుష్యం పేరుతో మూసి వేయించింది.ఆయన కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నారు. సంగండెయిరీని స్వాధీనం చేసుకునే జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. కరోనా వైరస్ గురించి మాట్లాడారన్న కారణంతో చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేయడానికి బృందాన్ని కూడా పంపారు. కానీ చివరిలో వెనక్కి తగ్గారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందని కారణంగా పెద్ద ఎత్తున రోగులు చనిపోవడం సంచలనం సృష్టించింది. పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ వచ్చిన రఘురామకృష్ణరాజును దేశద్రోహం కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. మార్చిలో బడ్జెట్ పెట్టకపోవడంతో ఈ నెలలో ఒక్క రోజు సమావేశాల్ని నిర్వహించి బడ్జెట్ పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెలలోనే ఆనందయ్య మందు దేశవ్యాప్తంగా ప్రచారం పొందింది. జూన్ :  మళ్లీ మాన్సాస్ చైర్మన్‌గా అశోక్ -  "మా" ఎన్నికల రచ్చ షూరూ ! 

జూన్ నెలలో సీఎం జగన్ మోడీ, షాలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు కానీ.. అపాయింట్‌మెంట్లు దక్కలేదు. దీంతో తిరిగి వచ్చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ కొత్తగా విచారణ జూన్ నుంచే ప్రారంభించింది. అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. మళ్లీ కోర్టు ఆయనను చైర్మన్‌గా నియమించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం జూన్‌లో పెరిగిపోయింది. మాటల మంటలు చెలరేగాయి. పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోలేదు. ఏపీ ప్రభుత్వం ఒక్క రోజే పది లక్షల టీకాలు వేయించి రికార్డు సృష్టించింది. ప్రభుత్వం అరకొర ఉద్యోగాలతో జాబ్ క్యాలెండ్ ప్రకటించడం వివాదం రేపింది. గతంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న జగన్.. కనీసం నాలుగు ఐదు వందల స్థాయిలో కూడా ఉద్యోగాలు ప్రకటించలేదన్న విమర్శలు వచ్చాయి. టెన్త్ పరీక్షలను పెట్టాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించి  భంగపాటుకు గురైంది. చివరికి సుప్రీంకోర్టులో పరీక్షలు పెట్టలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. మా ఎన్నికల గొడవ జూన్ నుంచే ప్రారంభమయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్‌ను ప్రకటించంతో  సినిమా ప్రారంభమయింది.

Also Read: స్టార్ హీరోలు.. ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదే..
     
జూలై  :  తెలుగు రాష్ట్రాల మధ్య - నీళ్లు నిప్పులు   
  
విశాఖపట్నం మాజీ ఎంపీ  కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి వరించింది. ఆయన పేరు ఎక్కడా ప్రచారంలో లేకపోయినా అనూహ్యంగా ఆయనకు పదవిని ఇస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంకు ఆయన గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూంటంతో  జూలైలోనే జగన్ క్లారిటీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో తెలంగాణ రాజకీయాల్లో నేనెప్పుడూ వేలు పెట్టలేదని .. పెట్టనని ప్రకటించారు. ఏపీలో ఆర్థిక వ్యవహారాలపై జూలై నుంచే రచ్చ ప్రారంభమయింది. మొత్తంగా లెక్కల్లో రూ. 40వేల కోట్ల వరకూ తేడా వస్తోంది. ఈ విషయంపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అయిన పయ్యావుల కేశవ్ నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో  వివాదాస్పద విమర్శకుడు కత్తి మహేష్ మరణించాడు.   తెలుగు రాష్ట్రాలకు నీళ్లపై హక్కుల్ని శాశ్వతంగా కోల్పోయాయి. ఇప్పుడు మొత్తం కేంద్రం చేతిలో పెత్తనం ఉంది. అక్రమ ప్రాజెక్టుల పేరుతో గొడవలు పడిన తెలుగు రాష్ట్రాల పరిస్థితిని.. కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ రాసిన లేఖను అడ్డం పెట్టుకుని కేంద్రం.. ఏకంగా కృష్ణా, గోదావరీ నది పరిధిలోని 107 ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంది. గెజిట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడుల అంశంలో  జాతీయ ఎస్సీ కమిషన్ ఈ అంశంపై నివేదిక ఇవ్వాల్సిందిగా...ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఇన్‌సైడర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

ఆగస్టు :  జీవోలన్నీ రహస్యం.. గంగవరం పోర్టు అమ్మకం - డ్రగ్స్ కేసు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఆగస్టు మొదట్లో సిఫార్సు చేసింది.    విశాఖలో  రుషికొండ బీచ్ రిసార్ట్  మొత్తంగా కూల్చేశారు. అక్కడ ఏదో నిర్మిస్తున్నారు. ఏం నిర్మిస్తున్నారో ఎవరికీ తెలియదు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను అదానీకి అమ్మేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌లో ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమూర్తుల్ని  కించ పరుస్తూ, తిడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన కేసుల్లో అరెస్టులు ప్రారంభించింది సీబీఐ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలేవీ ప్రజలకు తెలియచేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు అసాధారణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీవోలు ఏవీ పబ్లిక్ డొమైన్‌లో పెట్టవద్దని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ముత్యాలరాజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్‌ని తెలంగాణ సర్కార్ వదిలేసినా ఈడీ నోటీసులు జారీ చేసింది.

సెప్టెంబర్ :  బెయిల్ రద్దు పిటిషన్లు కొట్టి వేత - చంద్రబాబు ఇంటిపై దాడి 

సెప్టెంబర్‌లో ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు రిలీఫ్ లభించింది.  వారి బెయిళ్లను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేసింది.  విశాఖలో వైసీపీ ముఖ్య నేతగా చెలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్‌ను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019లో మళ్ల విజయప్రసాద్‌పై ఒరిస్సాలో కేసు నమోదైంది. సినిమాల కలెక్షన్ మొత్తం ముందుగా తమ ఖాతాలో పడేలా కొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఉన్న ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ తరహాలో ఏపీలో ఉన్న సినిమాహాళ్లు మొత్తానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఓ పోర్టల్ రూపొందించాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ బాధ్యతలు తీసుకున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురయ్యారు.  అయ్యన్నపాత్రుడు జగన్‌ను తిట్టారని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటపై దాడి చేశారు. ప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి రూ. లక్ష జరిమానా విధించింది. దేవీ సీ ఫుడ్స్ అనే కంపెనీ  కేసులో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో జరిమానా విధించింది. ఎన్నికల సంఘం టీడీపీ,  వైఎస్ఆర్ సీపీకి ప్రాంతీయ పార్టీలుగానే గుర్తింపు ఇచ్చింది. టీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. అయితే జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా కూడా రాలేదు. గుర్తింపు లేని పార్టీల జాబితాలోనే జనసేన పార్టీ కూడా చేరిపోయింది. సినీ పరిశ్రమపై ఆంక్షల విషయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Also Read: ఈ ఏడాదీ యువరాజ్‌ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!

అక్టోబర్ :  టీడీపీ ఆఫీసు.. ఇళ్లపై విధ్వంసం 

ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రం నలుమూలలా టీడీపీ నేతలు, ఆఫీసుల్లో విధ్వంసం సృష్టించారు. కార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై యాభై మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన సామాగ్రినంతటిని ధ్వంసం  చేశారు. పట్టపగలు అందరూ చూస్తూండగానే నింపాదిగా దాడులు చేసి వెళ్లిపోయారు. టీడీపీ ఆఫీసులో పకడ్బందీగా దాడులకు పాల్పడ్డారు. గాయపరిచారు. ఆస్తి విధ్వంసం చేశారు. కానీ ఒక్కరిపై కేసులు నమోదు కాలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ మంంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులపైపై సీబీఐ కేసులో దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.   సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య అధికారిక ప్రకటించారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు.  బద్వేలు బరి నుంచి టీడీపీ, జనసేన వైదొలిగాయి. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే బస్తర్ అడవల్లో అనారోగ్యంతో చనిపోయారు.

నవంబర్ :  రైతుల పాదయాత్ర - చంద్రబాబు కన్నీళ్లు - మూడు రాజధానుల బిల్లులు వెనక్కి 
 
అమరావతి రైతులు మహా పాదయాత్రను ప్రారంభించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర పేరుతో తుళ్లూరు  నుంచి తిరుపతికి పయనమయ్యారు. మిfగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించారు. గతంలో ఏకపక్ష విజయాలు నమోదు చేసిన వైసీపీ ఈ సారి కాస్త వెనుకడుగు వేసింది. కుప్పంలో టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సతీమణిపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు.  రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వరద విధ్వంసం సృష్టించింది.  అధికారికంగా 48 మంది చనిపోయారు. కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారారు. దీంతో అరెస్టుల్నిసీబీఐ ప్రారంభించింది. మూడు రాజధానుల బిల్లును..  మండలి రద్దు బిల్లును ఏపీ అసెంబ్లీ వెనక్కి తీసుకుంది. తిరుమలలో శ్రీవారి ఆలయ వ్యవహాలన్నింటినీ కనుచూపుతో శాసించే డాలర్ శేషాద్రి గుండెపోటుతో కన్నుమూశారు.  నవంబర్ నెలచివరి రోజే పాటల దిగ్గజ రచయిత సీతారామశాస్త్రి కన్నుమూశారు.

డిసెంబర్ :   ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు - సినిమా టిక్కెట్ల పంచాయతీ - రోశయ్య కన్నుమూత 
 
చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తమ పట్నం,  పోలవరం ప్రాజెక్టుకు కలిపి   రూ. 243 కోట్ల జరిమానా విధించింది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య కన్నుమూశారు. డిసెంబర్ నెలలోనూ ఏపీలో హైవోల్టేజ్ పొలిటికల్ డెలవప్‌మెంట్స్ చోటు చేసుకున్నాయి. రాజధాని రైతుల  పాదయాత్ర తిరుపతిలో ముగిసింది.  భారీ బహిరంగసభ నిర్వహించారు. వీరికి పోటీగా కొత్తగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. వారు కూడా సభ నిర్వహించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌తో  ఓ ఆటాడుకుంటోంది. అతి తక్కువ టిక్కెట్ రేట్లు ఖరారు చేసి.. మొత్తానికే మోసం తెచ్చి పెట్టే ప్రయత్నం చేసింది. దీంతో టాలీవుడ్ రగిలిపోతోంది. మరో వైపు ధియేటర్లలో తనిఖీల పేరుతో సీజ్ చేయడం కూడా ప్రారంభమయింది.


మొత్తంగా 2021 ఏడాదిలో పరిణామాలు ముందు ముందు ఏపీలో ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిణామాలను మార్చే విధంగా మారాయని అర్థం చేసుకోవచ్చు. అవేమిటో... భవిష్యత్‌లో తేలుతుంది. వచ్చే ఏడాది రాజకీయంగా ఏపీ మరింత ఉద్రిక్తంగా ఉండటం  ఖాయమని మాత్రం అనుకోవచ్చు. 

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ANDHRA PRADESH Yearender 2021 Year Ender 2021 Year End 2021 New Year 2022 Happy New Year 2022

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

SSC Paper Leakage Case : పదో తరగతి పేపర్ లీకేజీ కేసు, నారాయణ కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్

SSC Paper Leakage Case : పదో తరగతి పేపర్ లీకేజీ కేసు, నారాయణ కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్

Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో

Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !