Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021
టీ20ల్లో శతకాలు, వన్డేల్లో ద్విశతకాలతో మురిపించే రోహిత్ శర్మకు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. వరుస శతకాలతో ఇరగదీశాడు. టీమ్‌ఇండియాలో తనను వెలెత్తి చూపకుండా చేసుకున్నాడు.
గగన సీమలోని సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ భూమ్మీద ఉండేవారికి మాత్రం చీకటి తెరలు కమ్మినట్టు అనిపిస్తుంది. టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మా ఇంతే! దిగ్గజాల నీడలో నిరంతరం ఉదయిస్తూనే ఉన్నాడు. అభిమానులకు 'టన్ను'ల కొద్దీ ఆనందం పంచుతున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 2021లో హిట్‌మ్యాన్ మరింత ఎదిగాడు.
రైజింగ్ ఆఫ్ హిట్‌మ్యాన్
టీమ్‌ఇండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండు కళ్లు! ఎవరి ఆటతీరు వారిదే. ఇద్దరూ గొప్పవాళ్లే. కానీ టెస్టు క్రికెట్లో కింగ్ కోహ్లీకి ఇచ్చినంత ప్రాధాన్యం హిట్‌మ్యాన్ దక్కలేదు. 2021లో వారిద్దరి మధ్య ఉన్న అంతరం దాదాపుగా తొలగిపోయింది. టీ20ల్లో శతకాలు, వన్డేల్లో ద్విశతకాలతో మురిపించే రోహిత్ శర్మకు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. వరుస శతకాలతో ఇరగదీశాడు. టీమ్‌ఇండియాలో తనను వెలెత్తి చూపకుండా చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్‌లో చోటు దక్కనప్పుడు 'సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు..!' అంటూ ట్వీట్ చేసిన అతడు ఇప్పుడు తనను కాదనని పరిస్థితికి చేరుకున్నాడు.
పూర్తి స్థాయి కెప్టెన్
2021 హిట్‌మ్యాన్‌కు అన్ని విధాలుగా మేలు చేసిందనే చెప్పాలి. అతడి ఆటతీరులో మరింత పరిణతి పెరిగింది. నడవడి మరింత విధేయతను సంతరించుకుంది. సహరులతో అతడి స్నేహం మరింత బలంగా మారింది. ఎన్నాళ్లుగానో అతడి అభిమానులు చేస్తున్న డిమాండ్ ఈసారి నెరవేరింది. మిడిలార్డర్‌లో ఒక సాధారణ క్రికెటర్‌గా ప్రస్థానం మొదలు పెట్టిన అతడు ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. టీ20 సారథ్యం అందుకొని మురిసిన అతడు వన్డే పగ్గాలూ దక్కడంతో అందనంత ఎత్తుకు ఎదిగాడు! ఈ ఏడాది అతడి కెరీర్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఇవే.
ఆటా అద్భుతమే!
పరుగుల పరంగానూ రోహిత్ ఈ సారి హిట్టయ్యాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి 11 టెస్టులు ఆడాడు. 47.68 సగటుతో 906 పరుగులు చేశాడు. రెండు శతకాలు, 4 అర్ధశతకాలు బాదేశాడు. ఇక మూడు వన్డేల్లో 90 పరుగులు చేశాడు. 11 టీ20ల్లో 150 స్ట్రైక్‌రేట్, 38 సగటుతో 424 పరుగులు సాధించాడు. 5 అర్ధశతకాలు చేశాడు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా న్యూజిలాండ్‌పై టీ20 సిరీసును క్లీన్‌స్వీప్ చేశాడు. నాయకత్వం, వ్యవహార శైలిలో ఎంఎస్ ధోనీని తలపించే రోహిత్ శర్మ ఐసీసీ ట్రోఫీల్లో టీమ్‌ఇండియాను మరింత సమర్థంగా నడిపిస్తాడని, కప్పులు తీసుకొస్తాడని అభిమానులు, విశ్లేషకులు ఆశిస్తున్నారు.
Also Read: Ganguly on Virat Kohli: 'బోత్ ఆర్ నాట్ సేమ్..!' గంగూలీ వద్ద కోహ్లీ తప్పని నిరూపించే సాక్ష్యాలు?
Also Read: Kohli vs Ganguly: వేర్వేరు మాటలెందుకో? ఆ సంగతి గంగూలీనే అడగాలన్న సన్నీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి