సెప్టెంబరు 17 సభ ఏర్పాట్లలో అధికారులు- జిల్లా వేడుకల బాధ్యులను ప్రకంటిన బీఆర్‌ఎస్
సెప్టెంబరు 17కు తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన అంతమై, భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజు. దీన్ని ఒక్కో పార్టీ ఒక్కో విధంగా పాటిస్తోంది.
సెప్టెంబరు 17కు తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత ఉంది. నిజాం పాలన అంతమై, భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజు. దీన్ని ఒక్కో పార్టీ ఒక్కో విధంగా పాటిస్తోంది. విలీనం, విమోచనం, విద్రోహం లాంటి చర్చలు దీర్ఘకాలంగానే సాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. బీజేపీ సెప్టెంబరు 17ను విమోచనా దినం గా పరిగణిస్తోంది. అధికార బీఆర్ఎస్ మాత్రం జాతీయ సమైక్యతా దినంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది.
బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రెడీ అవుతోంది. గతేడాది పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కమలం పార్టీ...ఈ సారి అక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది. తుక్కుగూడ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అవుతోంది. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు సోనియా, ప్రియాంకాగాంధీలు హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా తీయ సమైక్యతా దినం ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరేసే బాధ్యతను...మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు అప్పగించింది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో కూడా అదే రోజు ఉదయం 9 గంటలకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
ఆదిలాబాద్ –ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, భద్రాద్రి కొత్తగూడెం –ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జగిత్యాల –మంత్రి కొప్పుల ఈశ్వర్, భూపాలపల్లి –ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,
జనగామ –మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జోగులాంబ గద్వాల –డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కామారెడ్డి –స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం –మంత్రి పువ్వాడ అజయ్, కరీంనగర్ – మంత్రి గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ –ఎమ్మెల్యే సుంకరి రాజు, మహబూబ్‌నగర్ –మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబాబాద్ –మంత్రి సత్యవతి రాథోడ్, మంచిర్యాల –ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మెదక్ –మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ –మంత్రి మల్లారెడ్డి జెండా ఎగరవేయనున్నారు.
ములుగు –ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, నాగర్‌కర్నూల్ –ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నల్లగొండ –మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నారాయణపేట –మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, నిర్మల్ –మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ –మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పెద్దపల్లి –ప్రభుత్వ చీఫ్‌విప్ భానుప్రసాద్ రావు, రాజన్న సిరిసిల్ల –మంత్రి కేటీఆర్, రంగారెడ్డి – మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డి –మంత్రి మహముద్ అలీ, సిద్దిపేట –మంత్రి హరీశ్‌రావు, సూర్యాపేట్ –మంత్రి జగదీశ్ రెడ్డి, వికారాబాద్ –మంత్రి మహేందర్ రెడ్డి, వనపర్తి –మంత్రి నిరంజన్ రెడ్డి, హనుమకొండ –ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ –డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, యాదాద్రి భువనగిరి –ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డిలు జెండాను ఆవిష్కరించనున్నారు.