News
News
X

BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్

BRS Vs BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లపై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆయనొక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుంచి... ఏం ఖర్మరా బాబు అంటూ ట్వీట్ చేశారు. 

FOLLOW US: 
Share:

BRS Vs BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యంగంగా ట్వీట్ వదిలారు. మొదటి నుంచి బండి సంజయ్ ని తన కౌంటర్ వ్యాఖ్యలతో టార్గెట్ చేస్తూ వచ్చిన కేటీఆర్ ఈమధ్య జరిగిన ఉమ్మడి జిల్లా పర్యటనలో సైతం ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూనే తన ప్రసంగాలను కొనసాగించారు. కరీంనగర్ లాంటి ఉద్యమాల గడ్డకి దొరికిన ఎంపీ పూర్తిగా సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. ఇక ఈసారి వదిలిన ఈ ట్వీట్ లో ఏముందో చూడండి.

ఢిల్లీలో పరమానందయ్య గారు ఫేకుడు, ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు..

నిజానికి ఈ ట్వీట్ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి అనే బీఆర్ఎస్ నేత సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. ప్రధానిగా మోదీ వచ్చాక మనం ఐదో స్థానానికి చేరుకున్నామంటూ బండి సంజయ్ తో కూడిన ఓ స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు దండాలు అంటూ పైగా జోకర్ ఎంపీ... యాక్సిడెంటల్ ఎంపీ అంటూ ట్వీట్ చేశారు. అయితే దీన్ని మళ్లీ షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పరమానందయ్య గారి ఫేకుడు.. ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు అంటీ ట్వీట్ చేశారు. అంతే కాదండోయ్.. ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుంచి అని తల కొట్టుకుంటున్నట్టుగా ఉండే ఎమోజీని యాడ్ చేసి షేర్ చేశారు. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తోంది.

ఇంతకీ సంజయ్ ఏమన్నారంటే..?

ప్రపంచ వ్యాప్తంగా దేశాల ఆర్థిక పరిస్థితుల విషయంపై నిర్వహించే సర్వేలో భారతదేశం ప్రధాని మోదీ బాధితులు చేపట్టకముందు పదో స్థానంలో ఉండేదని ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకిందని బండి సంజయ్ ఢిల్లీలో జరిగిన పత్రిక సమావేశంలో వ్యాఖ్యానించారు అంతేకాకుండా బడ్జెట్ కి సంబంధించి పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే అలా మాట్లాడే సందర్భంలో కొంత తడబాటుకు గురవడంతో అదే విషయాన్ని సెటైరికల్ గా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.

Published at : 03 Feb 2023 10:38 AM (IST) Tags: KTR Tweet Telangana News KTR Twitter BRS Vs BJP KTR Comments on Bandi Sanjay

సంబంధిత కథనాలు

Hyderabad Crime News:  హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!

Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

Weather Latest Update: దాదాపు తగ్గిపోయిన వానలు! నేడు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే

Weather Latest Update: దాదాపు తగ్గిపోయిన వానలు! నేడు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే

టాప్ స్టోరీస్

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!