అన్వేషించండి

BRS MLC Kavitha: జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు, వడ్డీతో సహా చెల్లిస్తా: కవిత

తనను తప్పు చేయకున్నా జైలుకు పంపించారని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

BRS MLC Kavitha Released from Tihar Jail | న్యూఢిల్లీ: తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం భర్త అనిల్ ను ఆళింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆలింగనం చేసుకోగా, కవిత వెన్ను తట్టారు. 165 రోజుల తరువాత కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.



BRS MLC Kavitha: జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు, వడ్డీతో సహా చెల్లిస్తా: కవిత

తిహార్ జైలు వద్దే కవిత మీడియాతో మాట్లాడుతూ.. నేను మంచిదాన్ని, అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా, కమిట్మెంట్ తో పనిచేస్తాం. చట్ట ప్రకారం మేం పోరాడతాం. నేను కేసీఆర్ కూతుర్ని, తప్పు చేసే ప్రసక్తే లేదు.  బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను కొందరు టార్గెట్ చేశారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఒక తల్లిగా అయిదు నెలలు కుటుంబాన్ని వదిలి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అన్ని గుర్తు పెట్టుకుంటాను. వీటికి తప్పకుండా వడ్డీ తో సహా చెల్లిస్తాను. అండగా నిలబడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. జై తెలంగాణ అంటూ’ నినాదాలు చేశారు. 

 

ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలే
తాము ఏ తప్పు చేయలేదని, ఈ విషయం తగ్గేదే లేదు. కానీ మమ్మల్ని టార్గెట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా జైలుకు పంపించారు. తెలంగాణ బిడ్డను. కేసీఆర్ కూతురు తప్పు చేయదు అన్నారు కవిత. మీడియా ముందు గట్టిగా మాట్లాడినా.. కుమారుడ్ని చూడగానే కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి కవిత కన్నీళ్లను ఆమె కుమారుడు తుడిచాడు. అక్కడి నుంచి ఢిల్లీలోని పార్టీ కార్యాయానికి కేటీఆర్, హరీష్ రావు, భర్త అనిల్ తో కలిసి కవిత, బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లిపోయాయి. మొన్నటి బెయిల్ పిటిషన్ వరకు కేటీఆర్, హరీష్ రావు కవిత కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఈసారి ఎలాగైనా కవితను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని బీఆర్ఎస్ బలగం ఢిల్లీలో పాగా వేసింది. అనుకున్నది సాధించింది. కవితకు బెయిల్ రావడంతో ఆమె భర్త అనిత్, కేటీఆర్ సహా కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Telangana Cabinet Decisions: తెలంగాణ కేబినెట్ వరాల జల్లు - జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. పుష్కరాలకు రూ.1,000 కోట్లు!
తెలంగాణ కేబినెట్ వరాల జల్లు - జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. పుష్కరాలకు రూ.1,000 కోట్లు!
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
Peddi Ticket Rates: పెద్ది పంచాయతీలో పెద్ద ట్విస్ట్... మళ్ళీ మొదటికొచ్చిన టికెట్ రేట్స్, ఎగ్జిబిటర్స్‌ ఇష్యూ
పెద్ది పంచాయతీలో పెద్ద ట్విస్ట్... మళ్ళీ మొదటికొచ్చిన టికెట్ రేట్స్, ఎగ్జిబిటర్స్‌ ఇష్యూ

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 Mohammed Shami: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
Ivanka Trump Assassination Plot: ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
Crime Thriller OTT : అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి
అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి
Embed widget