అన్వేషించండి

MLC Kavitha: తెలంగాణలో వార్ వన్ సైడ్! కాంగ్రెస్ గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు, బీజేపీ డిపాజిట్ గల్లంతు: కవిత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.

Kavitha Bathukamma Celebrations at Solapur:

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొడతారని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం సంతోషంగా ఉందనీ, మహారాష్ట్ర సంస్కృతిని కూడా పాటిస్తూ అక్కడ తెలంగాణ వాసులు గంగా జమున తహజీబ్ లా కలిసిపోయారని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ వెళ్లిన కవిత అక్కడ మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ ఎస్టీ, బీసీ సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.  తమ ప్రభుత్వం చేసిన  చేసిన మంచి పనులే తమను గిలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 
మరోసారి బీజేపీ డిపాజిట్ గల్లంతు..
గత ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని జోస్యం చెప్పారు. ప్రజలను ఎప్పుడూ మభ్యపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనన్నారు. 65 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ చేయనన్ని పనులను గత 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. కేసీఆర్ పాలనను ప్రజలు గమనించారు, కనుక బీఆర్ఎస్ వైపు నిలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు.
కాంగ్రెస్ గ్యారంటీలకు గ్యారంటీ ఉందా?
తమ పథకాలను కాపీ కొట్టి 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, మరి ఈ ఆరు గ్యారెంటీల అమలకు ఏ నాయకుడు గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు. దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాదని గాంధీ కుటుంబం గ్యారంటీల హామీలు ఇస్తోందని విమర్శించారు.

చేనేత పరిశ్రమల సందర్శన ... బీడీ కార్మికులతో కవిత సమావేశం
మహారాష్ట్ర సోలాపూర్ పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవిత చేనేత పరిశ్రమలను సందర్శించారు. వాటిలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో చేనేత కార్మికులకు పెన్షన్లు అందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసానిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేనేత రంగాన్ని విస్మరించడం వల్ల సంబంధిత పరిశ్రమలు కుదేలవుతున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. 

సోలాపూర్ లో పెద్ద సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులను కల్వకుంట్ల కవిత కలుసుకున్నారు. మహారాష్ట్రలో బీడీ కార్మికులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. సోలాపూర్ లో దాదాపు 70 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వము బీడీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని వారు కవిత దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో బీడీ కార్మికులకు అందిస్తున్న రూ. 2 వేల పెన్షన్ ను మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 3 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి ఓట్లు వేయాలని తెలంగాణలోని వారి బంధుమిత్రులను కోరుతున్నామని కవితకు వారు చెప్పారు.

సోలాపూర్ వైభవంగా బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ విచ్చేసిన కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పుంజల్ మైదాన్ లో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సోలాపూర్ లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. తదనంతరం దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget