అన్వేషించండి

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం - ప్రభుత్వం Vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడీ వేడీ వాదనలు

Telangana Assembly Sessions 2024: కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడీ వాదనలు సాగాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య హాట్ కామెంట్స్ హీట్ పుట్టించాయి.

BRS Mla Harish Rao Hot Comments in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తీవ్రమైంది. కృష్ణా నదీ జలాలు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి తరిమికొడితే.. మహబూబ్ నగర్ వాసులు ఎంపీగా గెలిచారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'పదేళ్లు జరిగిన పాపాలకు కారణం కేసీఆరే. ఆయన పాపాల భైరవుడు. కృష్ణా జలాల్లో ఎవరు వాటా అమ్ముకున్నారు? ఎవరు విందుకు అవకాశమిచ్చారు. కేసీఆర్ ను సభకు రమ్మనండి. ఎంతసేపు మాట్లాడుతామన్నా మైక్ ఇస్తాం. ఆయన అడిగిన వాటికి సమాధానం చెబుతాం.' అని అన్నారు. సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి సీఎం రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అన్నారు. ఆయన్ను కొడంగల్ నుంచి తరిమికొడితే.. మల్కాజిగిరి వచ్చారా.? అని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. హరీష్ వ్యాఖ్యలపై మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, భట్టి, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం తెలిపారు. 

కోమటిరెడ్డి Vs హరీష్ రావు

తొలుత కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం గత ప్రభుత్వం విధానాలు, లోపాల వల్లే జల దోపిడీ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పూర్తిగా అసత్యమైన ప్రజెంటేషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలగజేసుకుని ఏపీ సీఎం జగన్ స్టేట్ మెంట్ విన్న తర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు సరికావని.. అమేథీలో రాహుల్ ను కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు.

కేసీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యం వల్ల వ్యవసాయం సంగతి పక్కన పెడితే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. జగదీశ్ రెడ్డికే ముఖం చెల్లకే నేడు సభకు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన నల్గొండ సభకు రావాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ను అలా అనడం సరికాదని.. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హరీష్ రావు తీరును తప్పుబట్టారు. వాద ప్రతివాదనలతో అసెంబ్లీలో హీట్ వాతావరణం నెలకొంది.

Also Read: Telangana Assembly: 'కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం లేదు' - జల దోపిడీ అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YV Subbareddy SIT questions: హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Eatala Rajender Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
Advertisement

వీడియోలు

అతను పేపర్ కెప్టెన్ అంతే..  ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?
Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YV Subbareddy SIT questions: హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు సిట్ - కల్తీ నెయ్యి స్కాంలో కీలక చర్యల దిశగా అడుగులు
Supreme Court: బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతికి గడువు పెట్టలేం, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Eatala Rajender Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
తెలంగాణ బీజేపీలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మంటలు- ఈటల,బండి మధ్య మాటల యుద్ధం 
iBOMMA One Website : iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
iBOMMA పోయింది... iBOMMA One వచ్చింది - ఒక్కసారి క్లిక్ చేస్తే...
Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
Sonam Kapoor : మరోసారి తల్లి కాబోతోన్న స్టార్ హీరోయిన్ - పింక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో...
మరోసారి తల్లి కాబోతోన్న స్టార్ హీరోయిన్ - పింక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో...
Sundar Pichai:  ఏదో ఒక రోజు సీఈవో పోస్టు కూడ ఏఐ కొట్టేస్తుంది - ఆందోళన చెందుతున్న సుందర్ పిచాయ్
ఏదో ఒక రోజు సీఈవో పోస్టు కూడ ఏఐ కొట్టేస్తుంది - ఆందోళన చెందుతున్న సుందర్ పిచాయ్
Embed widget