Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
BRS : బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మహిళా నేతల్ని కించ పరిచారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర , గాజులు పంపుతూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు.
BRS leader Padi Kaushik Reddy is facing criticism for belittling women leaders : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేసేందుకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారికి చీర , గాజులు పంపుతున్నట్లుగా ప్రకటించారు.వారంతా ఆ చీర గాజులు వేసుకుని పబ్లిక్ లో తిరగాలని సూచించారు.వారికి ఇజ్జత్ లేదని ఆరోపించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయండి.
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) September 11, 2024
- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి@BRSparty pic.twitter.com/ry6efo6O83
పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళలను కించపరిచేలా ఉండంతో కాంగ్రెస్ మహిళా నేతలు గాందీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీర, గాజులు పంపడం అంటే ఏమిటని.. మహిళలను చేత కాని వాళ్లగా చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళల్ని కించ పరిచేలా మాట్లడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి పాడి కౌశిక్ రెడ్డికి షూ చూపించారు. రాజకీయాల్లో మహిళలను అవమానించే పద్దతి మంచిది కాదని.. తెలంగాణ ఉద్యమంలో మహిళలో ముందుండి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. మరోసారి కించ పరిచేలా చీర గాజులు చూపిస్తే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.
చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ - ఐఎంజీ పిటిషన్లలో ఆధారాల్లేవు - కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
బీఆర్ఎస్ నేతలు ఇదే మొదటి సారి గాదని పదే పదే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారని అందుకే.. చెప్పు చూపించాల్సి వచ్చిందని కాంగ్రెస్ మహిళా నేతలు స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని .. మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి పాడె ఎక్కే సమయం వచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మండిపడ్డారు. భార్య, కుమార్తెలతో ఆత్మహత్యలు చేసుకుంటానని బెదిరించి కౌశిక్ రెడ్డి గెలిచారడన్నారు. పాడి కౌశిక్ రెడ్డి దరిద్రపు గొట్టు చరిత్ర అందరికీ తెలుసన్నారు.
నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్
క్షమాపణలు చెప్పే వరకూ మహిళలతో నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంతకు ముందు కేటీఆర్ కూడా మహిళలకు ఉచిత బస్సు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనను మహిళా కమిషన్ పిలిపించి వివరణ తీసుకుంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా అలా మాట్లాడటంతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.