అన్వేషించండి

Telangana High Court : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ - ఐఎంజీ పిటిషన్లలో ఆధారాల్లేవు - కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

IMG Lands : చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ భరత అనే సంస్థకు భూములు కేటాయించారు. అవి అక్రమం అని దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. సరైన ఆధారాల్లేవని తెలిపింది.

Chandrababu :  చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ అనే సంస్థకు కేటాయించిన  భూములపై విచారణ చేయాలని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. అక్రమాలు జరిగాయనడానికి ఆదారాల్లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఐఎంజీ భరత అనే  సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ద్వారా  భూములు కేటాయించింది.  క్రీడా సంబంధిత అంశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు అమెరికాకు చెందిన ఐఎంజీ కంపెనీ సబ్సిడరీ అయిన ఐఎంజీ భరతకు భూములు కేటాయించారు. తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కేటాయింపుల్ని రద్దు చేశారు.

అయితే ఆ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఈ భూములు కేటాయింపులపై విచారణ చేయించాలని 2012లో హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని  సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు దాఖలు చేశారు. అంటే భూముల కేటాయింపులు కూడా రద్దు చేసిన  తొమ్మిదేళ్ల తర్వాత అక్రమాలని  పిటిషన్లు వేశారు. వీటిని ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 

నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్

ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్న పి.రాములు కూడా ఇంప్లీడ్ అయి వాదనలు వినిపించారు. నిజానికి ఇదే అంశంపై  మాజీ సీఎం జగన్‌ తల్లి విజయలక్ష్మి, కాంగ్రెస్‌ నేత పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి దాఖలు చేసిన కేసులను న్యాయస్థానాలు గతంలో కొట్టేశాయి. అయితే ఆ విషయాలను దాచి పెట్టి మరోసారి పిటిషన్లు వేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. భూముల కేటాయింపులు కూడా రద్దు అయ్యాయని..ఆ భూములన్నీ  ప్రభుత్వం వద్దనే ఉన్నాయన్నారు. 

21 ఏళ్ల క్రితం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి  ఇప్పుడు దర్యాప్తు కోరడం పూర్తిగా రాజకీయ పరమైన కోణమేనని ..  దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని రాములు తరపు లాయర్ వాదించారు. భూములు కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరిగాయో చూపించలేకపోవడంతో గతంలో కూడా కోర్టులు కొట్టి వేశాయి.  రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక విచారణలో ఏమైనా అక్రమాలు జరిగినట్టు తేలితే సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు సిద్ధమని  కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పిటిషన్లను కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. 

ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్                 

ఐఎంజీ భూముల పేరుతో చంద్రబాబు , టీడీపీపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. గతంలో కోర్టులు కొట్టి వేసినా పిటిషన్లు దాఖలు చేస్తూ..  కోర్టుల్లో వాదించే వాదనలను హైలెట్ చేస్తూ.. వస్తున్నారు. నిజానికి ఒప్పందాన్ని వైఎస్ రద్దు చేయడంతో ఒక్క ఎకరం కూడా ఆ సంస్థకు పోలేదు. అయినా అక్రమాలు జరిగాయని రాజకీయ ఆరోపణలకు కోర్టుల్ని వేదికగా చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ వస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Tirumala: తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
Embed widget