అన్వేషించండి

KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్

Telangana News | గతంలో మీరు ఎన్ని మాట్లాడినా పాపం ప్రతిపక్షంలో ఉన్నారని వదిలేశాం, తనపై అడ్డగోలుగా మాట్లాడిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ పై పరువునష్టం దావా వేస్తానన్నారు.

KTR says he will file defamation case against CM Revanth Reddy | కందుకూరు: తెలంగాణలో మంత్రుల కామెంట్లు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సిగ్గు, శరం ఉన్నోళ్లకు మర్యాద ఇవ్వాలి కానీ, రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికి అలాంటివి ఏమీ లేవన్నారు. మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల నోట్లోనే ఉందని.. గబ్బు మాటలన్న వాళ్లను వదిలేది లేదన్నారు. తపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖను వదిలిపెట్టేది లేదని, క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సైతం పరువు నష్టం దావా వేస్తా అని కేటీఆర్ తెలిపారు. ప్రధాని మోదీకే తాము భయపడలేదని, అలాంటిది ఈ చిట్టినాయుడికి ఎందుకు భయపడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లంక బిందెల కోసం తిరిగేది దొంగలే?

మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘సీఎం రేవంత్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పాడని, అమలుచేయలేని బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9 వ తేదీనే రుణమాఫీ అన్నాడు. మరి 10నెలలు అయిపోయినా ఎందుకు పూర్తి చేయలేదు. సెక్రటరియేట్ లో లంక బిందెలన్నాడు. వాటి కోసం తిరిగేది దొంగలు కదా ?. ఎన్నికలకు ముందు ఎక్కడ దేవుడు కనిపిస్తే ఆ దేవుళ్ల మీద ఒట్లు వేసిండు. ఈ గుంపుమేస్త్రీ ఇండ్లు కట్టేటోడు కాదు, పేద ప్రజల ఇండ్లు కూల్చేటోడు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటే ప్రజలు నమ్మి ఓట్లు వేసిన్రు. కానీ ఇళ్లు కూలగొట్టి వాళ్ల బతుకుల మీద కొడుతుండ్రు. 

KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్

రైతు భరోసా ఏటా రూ. 15 వేలు, బోనస్ పేరుతో 500 ఇస్తామని రేవంత్ అన్నాడు. ఇప్పుడు రైతుబంధు లేదు, రైతులకు భరోసా లేకుండా పోయింది. పెద్ద మనుషులు, మహిళలకు ఫించన్లు పెంచుతా అన్నాడు. దసరా వస్తోంది. బీఆర్ఎస్ ఇచ్చినట్లు కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ చీరలు వచ్చినయా? పండుగ పండుగలా ఉన్నదా? రుణమాఫీ చేసేందుకు డబ్బుల్లేవంట. కానీ రూ.1.5 లక్షల కోట్లు తీసుకెళ్లి మూసీలో పోస్తడంట. మూసీ ప్రాజెక్ట్ పేరుతో రూ. 25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లు దోచుకోవచ్చు. అది మూసీ బ్యూటీఫికేషన్ కాదు ప్రజలను లూటీఫికేషన్ మాత్రమే. 

ఉన్న సిటీ పట్టించుకోలేదు, ఫార్మా సిటీ అని డ్రామాలు

ఫార్మా సిటీకి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రజలకు చెప్పారు. ఒక్కరికైనా భూములు తిరిగి ఇచ్చారా. ఉన్న సిటీని పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడుతాడంట. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో కేంద్రం వాటాతో చేయాలని ప్రయత్నించాం. ఇప్పుడు RRR దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తదంట. కాంట్రాక్ట్ ల పేరుతో భారీగా దోచుకునే ప్రయత్నానికి ఇది సంకేతం. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సహా వారి సన్నిహితులకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకే ఇలా చేస్తున్నారు. మా ఇళ్లను కూల్చు. కానీ పేదల ఇళ్లను వదిలెయ్. మూసీ బాధితుల గోస చూస్తుంటే బాధనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చాయి. 50 ఏళ్లు వాళ్లు కట్టిన ట్యాక్స్ తిని ఇప్పుడు కబ్జాదారులు అనడం భావ్యమేనా. రెడ్డి కుంటలో నీ (రేవంత్ రెడ్డి) ఇళ్లును, నీ అన్న ఇళ్లును ముందు కూల్చు. సీ సీటు కాపాడుకునేందుకు పైసల కోసం ఇంతకు తెగిస్తారా. అవసరమైతే రాష్ట్ర ప్రజలం చందాలు వేసుకుని ఇస్తాం. పేదల ఇళ్ల జోలికి రావొద్దు.  100 రోజుల్లో చేస్తామంటూ ప్రజలను మోసం చేశారు. మిత్తితో సహా తిరిగిచ్చేలా చేస్తామని’ కేటీఆర్ హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget