By: ABP Desam | Updated at : 04 Aug 2022 04:22 PM (IST)
టీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు - బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. అందుకే టీఆర్ఎస్‌లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి వచ్చిన 12 మంది పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారన్నారు. త్వరలోనే మునుగోడు తరహాలో తెలంగాణలో మరిన్ని ఉపఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. తమ తమ నియోజకవర్గ ప్రజల నుంచి ఒత్తిడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు 12 మంది రాజీనామా చేయబోతున్నారని పేర్కొన్నారు.
చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం కూడా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ ఎవరైనా ఆ పని చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరించారు బండి సంజయ్. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దబోయే ఎన్నిక కాబోతోందని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి టీఆర్ఎస్ పై పోరాడుతున్నారని... అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు.
బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు బండి సంజయ్. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ తెర లేపారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుంచి 53 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ఇటీవల జరిగిన సర్వేలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత పెరగబోతోందని... బీజేపీకి సీట్లు, ఓట్ల శాతం మరింతగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ 3వ రోజు భువనగిరి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారి మధ్యలో సహప్రముఖ్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఫాంహౌజ్ వద్దకు వచ్చి జర్నలిస్టులతో కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు అంశాలపై స్పందించారు. అందులోని ముఖ్యాంశాలు.
Breaking News Live Telugu Updates: భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు చేస్తాం - బండి సంజయ్ వ్యాఖ్యలు
భార్యకు కు.ని. ఆపరేషన్ అన్నాడు- పిల్లల్ని ఖూనీ చేశాడు
Mobile Hospital: ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్ ఆస్పత్రి, గిరిజనుల కోసం మెగా వైద్య శిబిరం!
Safai Mitra: సఫాయి మిత్ర పోటీల్లో కరీంనగర్ ముందంజ, మొదటి స్థానాన్ని దక్కించుకుంటుందా?
Cotton Farmers News: పత్తి రైతుల పుట్టి ముంచుతున్న అధిక వర్షాలు, ఏం చేసేది?
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్న్యూస్, తెలంగాణ సర్కార్కు షాక్ - కీలక తీర్పు
The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!