అన్వేషించండి

Telangana Elections 2023: 'బీసీని సీఎం చేస్తామని ఆ పార్టీలు చెప్పగలవా?' - అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ తెస్తామన్న లక్ష్మణ్

BJP Mp laxman: ఎన్నికల్లో గెలిస్తే బీసీని సీఎంగా చేస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెప్పగలవా అంటూ బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ నిలదీశారు. బీసీల అభ్యున్నతికి ఒక్క బీజేపీనే ఆలోచిస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంను చేస్తామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నాయని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో బీసీలను అన్ని విధాలుగా అణచివేశారని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. 'బీసీ వ్యక్తి సీఎం అయ్యేది లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు' అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవహేళన చేశారని గుర్తు చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఒక్క కమిషన్ కూడా వేయని కాంగ్రెస్ ఇప్పుడు వారి పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తామని, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ చెప్పగలవా.? అంటూ నిలదీశారు.

'ఏకైక పార్టీ బీజేపీ'

బీసీల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీసీల సాధికారత కోసం కట్టుబడి ఉన్నామని, బీజేపీ ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో 31 మంది బీసీలకు టికెట్లు కేటాయించామని చెప్పారు. అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 7న బీసీ ఆత్మ గౌరవ సభ, 11న ఎస్సీ వర్గీకరణపై సభ ఉంటుందని వివరించారు. ప్రధాని మోదీ ఈ సభలకు హాజరవుతారని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ పర్యటన ఖరారు

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఆయన నవంబర్ 7న రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి వచ్చి, 5:30 నుంచి 6:10 వరకూ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సభ ముగించుకుని 06:35కు తిరిగి ఢిల్లీ పయనమవుతారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, దాదాపు లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ ప్రతినిధుల బృందం సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

Also Read: Telangana Elections 2023 : కాళేశ్వరం అవినీతిపై 15 నిమిషాల్లో సీబీఐ విచారణ - ఒక్క షరతు పెట్టిన కిషన్ రెడ్డి !

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget