Bhatti Vikramarka: రామగుండంలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్, సూపర్ టెక్నాలజీతో - డిప్యూటీ సీఎం
Singareni: సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తామన్నారు.

Ramagundam News: రామగుండంలో 62.5 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని, తద్వారా ఎన్నికల హామీని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న హామీని పూర్తి చేయాలని వారంతా కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.
నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మకమైన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ను తిరిగి నిర్మిస్తామన్నారు. పిట్ హెడ్ ప్లాంటును సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాగూర్ సింగ్, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

