అన్వేషించండి

Bhatti Vikramarka: చంద్రబాబు గురువు కాదు, రేవంత్ శిష్యుడు కాదు - ఆ వ్యాఖ్యలపై భట్టి సీరియస్

Chandrababu Revanth Reddy News: బుధవారం (జూన్ 3) తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డితో కలిసి మిషన్ భగీరథపై రివ్యూ చేశారు.

Telangana News: చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే మాటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అలా అనకూడదని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారని భట్టి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎలాంటి గురువు కాదని, చంద్రబాబు రేవంత్ రెడ్డికి కేవలం సహచరుడు మాత్రమే అని స్పష్టం చేశారు. అది కూడా కొన్నేళ్ళ క్రితం నాటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు ఎవరిదారి వారిదని, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అని అన్నారు.

‘‘ఇద్దరు సహచర ముఖ్యమంత్రులమే తప్ప గురు శిష్యులం కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం అంశం లేదు. బీఆర్ఎస్ ఆర్డినెన్స్ తెచ్చి ఏపీకి అప్పజెప్పింది. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీలే’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

మిషన్ భగీరథపై భట్టి రివ్యూ
మిషన్ భగీరథ పథకం కింద రూ.42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారు. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని, నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రానికి నివేదిక పంపారు.. అంటే ఆనాటి ప్రకటన భోగస్ అని భావించాలా అని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అధికారులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో 23,824 ఆవాసాలు ఉండగా 1156 ఆవాసాల్లో 50 శాతం మాత్రమే నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అంటున్నారు, ఆలేరు, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్ రావడం ఏంటని డిప్యూటీ సీఎం మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా పై ప్రస్తుతం జరుగుతున్న సర్వే, అది ఎప్పుడు పూర్తవుతుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తికాగానే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు ఆ నివేదికలు అందజేసి... తాగునీరు అందుతుందన్న విషయాన్ని వారి ద్వారా నిర్ధారణ చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

42 వేల కోట్లు ఖర్చు చేసిన ఇంకా తాగునీటి ఎద్దడి ఉందని కొత్తగూడెం, ఆలేరు అంటే నియోజకవర్గాల్లో అదనపు నిధులు కోరుతున్నారు.. ఇదేంటని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్ మెట్రో నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండగా ఆయా మున్సిపాలిటీలు మిషన్ భగీరథ కింద మంచి రెడ్డి సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తాగునీటి సరఫరా కి ప్రధాన సోర్స్ ను వందల కిలోమీటర్ల నుంచి కాకుండా ప్రతి సమీపంలో నుంచి తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తీసుకోవడం మూలంగా తరచూ పైప్ లైన్ లు  పగిలిపోవడం వంటివి ఉత్పన్నమై తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. 

మిషన్ భగీరథ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది జీవితాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి అని ప్రశ్నించారు. ఒక్కో ప్రాంతంలో ఒకరకంగా కార్మికుల వేతనాలు ఉంటున్నాయి, 8000 నుంచి 13 వేల వరకు అందుతున్నట్టు నాకు సమాచారం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న వేతనాల నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని మిషన్ భగీరథ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారు దీనిపై సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు  కార్మికులకు ప్రయోజనం చేకూర్చాల తప్ప మధ్య భక్తులకు కాదని అన్నారు.  రాష్ట్రంలో మొత్తం ఉన్న ఏజెన్సీలు ఎన్ని, ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు, ఏజెన్సీలు కార్మికులకు ఇస్తున్న వేతనాల వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం కోసం చేసిన వేల కోట్ల అప్పు చెల్లిస్తున్న పథకం ప్రయోజనం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్కమాలు అన్నారు. సమీక్ష సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య, మెంబర్ సెక్రెటరీ టీఎస్ ఫైనాన్స్ కమిషన్ స్మిత సబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Tahawwur rana: కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
Mark Shankar:  మార్క్ శంకర్ లెటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే - పవన్ ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా !
మార్క్ శంకర్ లెటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే - పవన్ ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా !
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Viral Video: ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
ఓటు వేస్తే ఒంటరి మహిళల్ని తల్లుల్ని చేస్తాడట - ఓ లీడర్ హామీ - మహిళా లోకం ఊరుకుంటుందా?
Embed widget