Bandi Sanjay : కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతుంటాయి - పదవి పోవడంపై బండి సంజయ్ నిర్వేదం !
కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకుండానే ముగిసిపోతాయని నిర్వేదం వ్యక్తం చేశారు బండి సంజయ్. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Bandi Sanjay : " మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతుంటాయి " అని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వేదం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించిన బీజేపీ అధిష్ఠానం, ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో భావోద్వేగంతో ఓ పోస్ట్ పెట్టారు. తన పదవీకాలంలో విచారించదగ్గ ఘటనలేవీ లేకపోవడం సంతోషదాయకమని, అందరూ కూడా మర్చిపోలేని మధురానుభూతులు అందించారని పేర్కొన్నారు. అరెస్టుల సమయంలో, దాడులకు గురైన సమయంలో, ఉల్లాసంగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి నిలిచారని ధన్యవాదాలు తెలిపారు.
Officially signing off as @BJP4Telangana State President 🙏
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023
Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri…
కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటంలో కార్యకర్తల పాత్ర ఎనలేనిదని, వారికి హేట్సాఫ్ చెబుతున్నానని వెల్లడించారు. అరెస్ట్ లకు, దాడులకు భయపడకుండా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. వాన లేదు, ఎండా లేదు… కార్యకర్తలు అన్ని వేళలా తనకు తోడుగా ఉన్నారని బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. తన పదవీకాలంలో పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని కోరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో మద్దతు ఇచ్చి, ప్రేమాభిమానాలు ప్రదర్శించిన కార్యకర్తలకు, ప్రోత్సహించిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి, తెలంగాణ బీజేపీ నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాసంగ్రామ యాత్రలో మనస్ఫూర్తిగా స్వాగతించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన కరీంనగర్ ఓటర్లకు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బండి సంజయ్ వివరించారు. అరెస్ట్ లకు, దాడులకు భయపడకుండా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. వాన లేదు, ఎండా లేదు… కార్యకర్తలు అన్ని వేళలా తనకు తోడుగా ఉన్నారని బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. తన పదవీకాలంలో పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని కోరారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో మద్దతు ఇచ్చి, ప్రేమాభిమానాలు ప్రదర్శించిన కార్యకర్తలకు, ప్రోత్సహించిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి, తెలంగాణ బీజేపీ నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. ప్రజాసంగ్రామ యాత్రలో మనస్ఫూర్తిగా స్వాగతించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన కరీంనగర్ ఓటర్లకు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బండి సంజయ్ వివరించారు.