అన్వేషించండి

Bandi Sanjay : హామీలు అమలు చేయకుండా కాలయాపన - రేవంత్ పాలనపై బండి సంజయ్ విమర్శలు

Telangana News : పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే వరకూ దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు . ప్రజాపాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Bandi Sanjay :   అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ‘‘షెడ్యూల్ ప్రకారం చూస్తే…వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమే.’’అని పేర్కొన్నారు.

కాలయాపన చేస్తే ప్రజలు సహించరు ! 

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.  తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ప్రతి విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో,  6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారు. వాటినెలా తీరుస్తారు? కొత్త హామీలను ఎలా తీరుస్తారోననే ఆందోళనలో ప్రజలున్నారు. వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ‘‘అట్లాగే గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలే. రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నా. ’’అని చెప్పారు.

కేంద్రం సాయం కావాలంటే ఎక్కువ మంది ఎంపీల్ని గెలిపించాలి!  

‘‘అప్పుల బారినుండి తెలంగాణ గట్టెక్కాలన్నా… ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కావాలన్నా కేంద్ర సాయం అవసరముందని అన్నారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. అట్లాంటప్పుడు కేంద్రం నుండి అదనపు నిధులు తీసుకురావాలంటే రాష్ట్రం నుండి అత్యదిక మంది ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉంది. తద్వారా కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించి అదనపు నిధులు తీసుకొచ్చే అవకాశముంది.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరుతున్నా.’’అని విజ్ఝప్తి చేశారు.  

మాల్దీవుల అంశంలో భారతీయులకు హ్యాట్సాఫ్ 

మాల్దివుల అంశాన్ని ప్రస్తావిస్తూ… ‘‘భారత్ ను, ప్రధాని మోదీ ని దూషిస్తే… ఫలితాలు ఎట్లుంటాయో మాల్దివుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా…. భారత్ లో పర్యాటక ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేసేందుకు ప్రధాని మోదీ గారు లక్ష్యద్వీప్ కు వెళితే.. మాల్దివులకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రపంచం సిగ్గుపడేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. ఈ నేపథ్యంలో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’’ అంటూ సోషల్ మీడియాలో భారతీయులు పెట్టిన పోస్టు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. ఫలితంగా మాల్దీవుల్లోని 8,500 హోటల్లో చేసుకున్న బుకింగులు, 2,500 మంది విమాన టిక్కెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. దీనివల్ల మాల్దీవులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన ఆ దేశ ప్రభుత్వం ఆ ముగ్గురు మంత్రులను తొలగించి… వారి వ్యాఖ్యలు వ్యక్తిగతమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది… భారత్ ఐక్యతను మాల్దివులకు రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా… హిందూ ధర్మరక్షణ, దేశ రక్షణ, దేశ ఐక్యత విషయంలో ఇదే పంథాను కొనసాగించాలని ప్రతి ఒక్క భారతీయుడిని కోరుతున్నానన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget