By: ABP Desam | Updated at : 16 Mar 2023 10:01 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
భట్టి విక్రమార్క పాదయాత్ర
Bhatti Vikramarka Padayatra : తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో కుమ్రంభీం, గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి హథ్ సే హథ్ జోడో పాదయాత్రను మల్లు భట్టి విక్రమార్క స్టార్ట్ చేశారు. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ ఠాక్రే, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పోడేం వీరయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్, జావిద్, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావ్ లు పాల్గొన్నారు. పాదయాత్రకు వచ్చిన సీఎల్పి నేత విక్రమార్కకు ఆదివాసీలు గుస్సాడి నృత్యాలు, డప్పులతో ఘన స్వాగతం పలికారు. మహిళలు తీలకం దిద్ది హారతులిచ్చారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ శ్రేణులు తరలిరావడంతో పిప్పిరి గ్రామం జనసంద్రంగా మారింది. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేలాదిగా కదిలి వచ్చిన కార్యకర్తలు, ప్రజల మధ్యన పాదయాత్ర ఉత్సాహంగాసాగుతుంది. భట్టి విక్రమార్క పిప్పిరి నుంచి ఇచ్చోడకు బయలుదేరారు. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. మరికొద్ది సేపట్లో ఇచ్చోడలో కార్నర్ మీటింగ్ ప్రారంభకానుంది.
39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర పాదయాత్ర
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగనుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్రను డిజైన్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ బీఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని భట్టి విక్రమార్క అన్నారు.
బోధన్ నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకుని బతికేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. బోధన్ కార్నర్ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆ రోజు తెలంగాణ ఇయ్యకుంటే ఈ రోజు కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టే..మీ అయ్యా సీఎం, నువ్వు, నీ బావ మంత్రులు, మీ చెల్లె ఎమ్మెల్సీ అయ్యారన్నారు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న వైభవానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. నిన్న జుక్కల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
బోధన్ నియోజకవర్గం పరిధిలోని ఎడపల్లి నుంచి బోధన్ వరకు పాదయాత్ర చేపట్టారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతాలు పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజల్లో విశ్వాసం కలిగించడం కోసం నఫ్రత్ చోడో భారత్ జోడో అనే సందేశంతో రాహుల్ గాంధీ దేశమంతా పాదయాత్ర చేశారన్నారు. నిజామాబాద్ అంటే నిజాం సాగర్ గుర్తుకొస్తుందన్నారు. నిజామాబాద్ అంటే పెద్దలు ఎం.నారాయణ రెడ్డి, అర్గుల రాజారాం, బాలగౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి వంటి వారు గుర్తుకొస్తారన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడం కోసం ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును మంజూరు చేశారన్నారు. కానీ నేడు కేసీఆర్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
Ponguleti : రూ. వంద కూడా ఇవ్వలేదు - శ్రీరాముడ్నే కేసీఆర్ మభ్య పెట్టారు - మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు !
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణార్పణ! కానీ రాహుల్ గాంధీపై కేంద్రం ఇంత కక్ష సాధింపా?: సుదర్శన్ రెడ్డి
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?