News
News
X

Youtube New Design: యూట్యూబ్‌కు సరికొత్త హంగులు, ఈ ఫీచర్స్ మీరు ఊహించి ఉండరు!

యూట్యూబ్ సరికొత్త అవతారాన్ని సంతరించుకుంది. మరింత ఆకట్టుకునేలా యూట్యూబ్ ను రీడిజైన్ చేసినట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇకపై నచ్చినట్లుగా వీడియోలను జూమ్ చేసి చూసే వెసులుబాటు ఉంటుందని చెప్పింది.

FOLLOW US: 
 
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ లేటెస్ట్ హంగులను అద్దుకుంది. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు పలు కీలక మార్పులు చేసినట్లు గూగుల్ వెల్లడించింది. రీష్రెష్ చేయబడిన లుక్ తో పాటు ఆకట్టుకునే వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.  ఇందుకు సంబంధించిన సరికొత్త అప్ డేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  యూట్యూబ్ యాప్ ఇంటర్ ఫేస్ ను పూర్తిగా మార్చేసింది. ఫించ్ టు పించ్ జూమ్ తో పాటు యాంబియంట్ మోడ్ సహా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, యూట్యూబ్ లింక్ బటన్లతో పాటు లైక్, షేర్, డౌన్ లోడ్ బట్లనకు కొత్త రూపు తీసుకొచ్చింది.   

సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ ముస్తాబు

యూట్యూబ్ ఈ ఏడాది 17వ యానివర్సరీని జరుపుకుంది. ఈ సందర్భంగా  యూట్యూబ్ యాప్ కు చిన్న మేకోవర్ ఇస్తున్నట్లు కంపెనీ బ్లాగ్ లో పోస్ట్ చేసింది. ఇక కంటెంట్ క్రియేటర్లకు ప్రయోజనం కలిగే పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న సబ్ స్క్రైబ్ బటన్ ను మరింత బాగా కనిపించేలా చేసింది. వ్యూవర్ చూడగానే సబ్ స్క్రైబ్ బటన్ నొక్కే అవకాశం ఉంది. దీంతో పాటు యాంబియంట్ మోడ్ ను జోడించింది. ఇది టచ్-అప్‌ను కూడా పొందుతుంది. కొత్త ఆకారంతో పాటు  హై కాంట్రాస్ట్ హైలెట్ చేస్తుంది. డైనమిక్ కలర్ శాంప్లింగ్‌ ని ఉపయోగించి చక్కటి అనుభూతిని పరిచయం చేస్తుంది. యాప్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్లే అవుతున్న వీడియోకు సరిపోయేలా ఉంటుంది. యాంబియంట్ మోడ్ YouTube వెబ్, మొబైల్ వినియోగదారులకు డార్క్ థీమ్‌లో అందుబాటులో ఉంటుంది.

ఆకట్టుకుంటున్న కొత్త మార్పులు

ప్రస్తుతం వచ్చిన నూతన అప్ డేట్స్ లో కీలకమైనది పించ్ టు జూమ్. ఐవోఎస్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లలో వీడియోను పించ్ తో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, వీడియో కంటెంట్ మంచి క్వాలిటీలో జూమ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. Precise seeking అనే సరికొత్త ఫీచర్ ను కూడా యూట్యూబ్ పరిచయం చేసింది. దీని సాయంతో వీడియోలో కావాల్సిన భాగాన్ని ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది.

News Reels

"అభివృద్ధి దశలో మాకు కలర్ అనేది కీలకమైన థీమ్. వీక్షకుల అలవాట్లను కోల్పోకుండా మా యాప్‌లకు వైబ్రేషన్‌ని జోడించాలనుకుంటున్నాం. అది వారి సిఫార్సు చేసిన వీడియోలను ఆస్వాదించినా, లేదంటే  కొత్త కంటెంట్ కోసం బ్రౌజ్ చేసినా కొత్త అనుభూతి కలిగించేలా చేయాలనుకున్నాం.  అనేక ఆలోచనల అనంతరం యాంబియంట్ మోడ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఫీచర్లు వినియోగదారులకు మెరుగైన అనుభూతిని కలిగిస్తాయని భావిస్తున్నాం” అని యూట్యూబ్ వెల్లడించింది.   

Read Also: వాట్సాప్ నుంచి సూపర్ అప్ డేట్, ఇకపై వన్ టు వన్ చాట్ లోనూ పోల్స్ పెట్టుకోవచ్చు!

Published at : 26 Oct 2022 01:01 PM (IST) Tags: YouTube Youtube New Design YouTube New Facelift Pinch To Zoom Ambient Mode

సంబంధిత కథనాలు

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు