WhatsApp: వాట్సాప్ నుంచి సూపర్ అప్ డేట్, ఇకపై వన్ టు వన్ చాట్ లోనూ పోల్స్ పెట్టుకోవచ్చు!
వాట్సాప్ మరో లేటెస్ట్ అప్ డేట్ తీసుకొచ్చింది. వన్ టు వన్ చాట్‌లలో పోల్‌లను క్రియేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం కొంతమంది iOS బీటా వినియోగదారులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది.
మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త అప్ డేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత ఉత్తేజపరిచేందుకు వాట్సాప్ చాలా అప్‌డేట్‌లపై పనిచేస్తోంది. తాజాగా వన్ టు వన్ చాట్ లలోనూ పోల్స్ సృష్టించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ లోని iOS బీటా టెస్టర్‌లకు వన్-టు-వన్ చాట్‌లలో పోల్‌లను సృష్టించే సామర్థ్యాన్ని అందిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని WABetaInfo వెల్లడించింది. యాప్ టెస్ట్ ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా ఈ అప్ డేట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెర్షన్‌ను 22.22.0.75లో ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నెల మొదటి వారంలో విడుదల
WABetaInfo తాజా అప్ డేట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ నెల తొలి వారంలో Meta-యాజమాన్య యాప్ కొంతమంది iOS బీటా వినియోగదారుల కోసం ఇతర గ్రూప్ పార్టిసిపెంట్‌లతో పోల్‌లను పంచుకునే సామర్థ్యాన్ని విడుదల చేసింది. తాజాగా మరో ముందడుగు వేసి వన్ టు వన్ చాట్‌లకు పోల్స్‌ను క్రియేట్ చేసుకునే ఫీచర్‌ను విడుదల చేసింది. WABetaInfo ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. "ఇది మీ వాట్సాప్ అకౌంట్ కు అందుబాటులో ఉందో? లేదో? తెలుసుకోవాలంటే, చాట్ షేర్ ఎంపికలను ఓపెన్ చేయండి. ఫీచర్ అందుబాటులో ఉన్నట్లయితే, మీరు ఒకరితో ఒకరు చాట్‌లలో పోల్‌లను భాగస్వామ్యం చేయడం మొదలు పెట్టవచ్చు” అని తెలిపింది. వ్యక్తిగత చాట్‌ల కోసం పోల్స్ ఫీచర్ ఈ నెల ప్రారంభంలో కొంతమంది Android బీటా వినియోగదారుల విడుదల చేయబడింది.
12 ఆప్షన్లతో పోల్స్ నిర్వహించుకునే అవకాశం
వాస్తవానికి వ్యక్తిగత చాట్ లలో పోల్స్ అనేవి అర్థవంతంగా ఉండవు. కానీ, వేర్వేరు ఎంపికల మధ్య గందరగోళం ఏర్పడినప్పుడు స్నేహితుల నుంచి మెరుగైన పరిష్కారం కోసం ఈ పోల్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చాట్ లలో మాదిరిగానే, వినయోగదారులు వ్యక్తిగత చాట్ లలో గరిష్టంగా 12 ఆప్షన్స్ ను యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. ప్రస్తుతానికి ‘పోల్స్’ ఫీచర్ కొంతమంది iOS బీటా వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేయబడింది. మరికొద్ది రోజుల్లో వినియోగదారులు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ యాప్ ఇటీవల కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అవతార్‌లను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 2.22.23.8 తో పాటు 2.22.23.9 కోసం WhatsApp బీటా అవతార్‌ల అందుబాటులోకి తెచ్చింది. ఈ అవతార్ల ద్వారా, వినియోగదారులు WhatsApp సెట్టింగ్‌లలో డిజిటల్ వ్యక్తీకరణను సెటప్ చేయడం ద్వారా వారి ఐడెంటిటీని పర్సనలైజ్ చేసుకోవచ్చు.
Read Also: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!
📝 WhatsApp beta for iOS 22.22.0.75: what's new?
— WABetaInfo (@WABetaInfo) October 22, 2022
WhatsApp is rolling out the ability to create polls in one-to-one chats to some lucky beta testers!https://t.co/dXz3Emwiq2