Wearable AC: ఈ ఏసీని మెడకు తగిలించుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు, ధర ఎంతో తెలుసా?
ఎండల్లో వడగాల్పులు భరించడం కష్టమే. అయితే, ఈ పోర్టబుల్ ఏసీని మెడలో వేసుకుంటే చాలు శరీరం మొత్తం చల్ల చల్లగా కూల్ కూల్‌గా మారిపోతుంది.
Wearable AC | ఒక పక్క ఎండలు, మరో పక్క ఉక్కపోత.. ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఓ ఏసీ ఉంటే నడుము కట్టుకుని వెళ్లిపోవచ్చు అనిపిస్తుంది. అయితే, మీకు అంత శ్రమ అక్కర్లేదు. ఈ సరికొత్త ఏసీని ఇయర్ ఫోన్‌లా ఇంచక్క మెడలో వేసుకుని వెళ్లిపోవచ్చు. అందులో నుంచి వచ్చే గాలి మీకు చల్లదనాన్ని అందించడమే కాదు, మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
మెటౌరా ప్రో (Metaura Pro) అనే సంస్థ ప్రపంచంలోనే తొలిసారి మెడలో ధరించగలిగే ఎయిర్ కండిషనింగ్ పరికరాన్ని తయారు చేసింది. ఈ ఏసీ 7 డిగ్రీల నుంచి 18 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు చల్లదనాన్ని అందిస్తుంది. ఇది చల్ల గాలిని ఉత్పత్తి చేయడానికి పోర్టబుల్ కూలింగ్ సొల్యూషన్‌పై ఆధారపడుతుంది. ఇందులోని ఏఐ టెక్నాలజీ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఈ ఏసీని ట్విన్-టర్బో PWM మోటార్, కూలింగ్ మాడ్యూల్స్‌తో తయారు చేశారు. అయితే, మెడకు తగిలించడం వల్ల కేవలం ముఖాన్ని మాత్రమే చల్లబరుస్తుందని అనుకుంటే పొరపాటే. ఇది శరీరం మొత్తాన్ని చల్లగా ఉంచుతుంది. కాబట్టి, మీరు దీన్ని మెడలో వేసుకుని జాగింగ్, వాకింగ్‌లకు వెళ్లవచ్చు.
Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..
Metaura Pro కాలర్ ఏసీ బ్యాటరీ ద్వారా పని చేస్తుంది. USB-C ఛార్జింగ్ ద్వారా ఇది వేగంగా ఛార్జ్ అవుతుంది. పూర్తి బ్యాటరీపై ఇది 8 గంటల వరకు పనిచేస్తుంది. ఈ పరికరం మొత్తం బరువు 435 గ్రాములు మాత్రమే. అయితే, ఇందులో ఫ్యాన్స్ తిరగడం వల్ల శబ్దాలు ఏస్థాయిలో ఉంటాయనేది ఉత్పత్తి సంస్థ వెల్లడించలేదు. ఈ ఏసీని క్రౌడ్‌ఫిండ్ ద్వారా డెవలప్ చేశారు. మే నెలలో ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. దీని ధర 159 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.12,043) వరకు ఉంది. మరి, మీకు కావాలా? ఈ కాలర్ ఏసీ? ఇది ఎలా పనిచేస్తుందనేది ఈ కింది వీడియోలో చూడండి. మీకు కూడా దీన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది.
వీడియో:
Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?
エアコンを常に持ち運ぶ! 首元から4度低い風を吹き出す「Metaura Pro」Kickstarterに登場 https://t.co/ze8YCqoNRv pic.twitter.com/KjdT201C17
— たかしまただお (@tadaotadao) April 2, 2022