Nude Pics To Space: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?
150 ఏళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ‘నగ్న సందేశం’ ద్వారా ఆ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాజెక్ట్? నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి ఎందుకు పంపుతున్నారు?
Nude Photos To Space | పనిలేని బ్యూటీషియన్ పిల్లికి మేకప్ వేసినట్లు.. యూకేలో ఎలియెన్స్ కోసమే పనిచేస్తున్న శాస్త్రవేత్తల టీమ్‌కు ఓ కత్తిలాంటి ఐడియా వచ్చింది. ఎన్ని సంకేతాలిస్తున్నా ఎలియన్స్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ‘ఆపరేషన్ ఆకర్ష’ చేపట్టారు. ఇందులో భాగంగా మన్మథ అస్త్రాన్ని ఎలియన్స్ మీదకు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా స్త్రీ, పురుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి వదలాలని నిర్ణయించుకున్నారు.
‘సైబర్‌ఫ్లాషింగ్’ చట్టం ప్రకారం స్త్రీ, పురుషుల జననాంగాలు కనిపించే నగ్న చిత్రాలను ఇతరులకు పంపడం నేరం. అయితే, అంతరిక్షానికి ఈ రూల్స్ వర్తించవనే కారణంతో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి నడుం కట్టారు. గ్రహాంతరవాసులను సంప్రదించేందుకు గత 150 ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు విఫల ప్రయత్నాలు ఎన్నో చేశారు. బోలెడన్ని నిధులను వెచ్చించారు. కానీ, ఇప్పటికీ ఫలితం చిక్కలేదు. ఈ నేపథ్యంలో NASA శాస్త్రవేత్తలు.. ఎలియెన్స్‌లో కోరికలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
భూమిపై నుంచి మనుషులు పంపుతున్న సంకేతాలను ఎలియెన్స్ అర్థం చేసుకోలెకపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగ్న చిత్రాల ద్వారా మనుషులు ఎలా ఉంటారో చూపించడం ద్వారా వారికి భూమిపై అవగాహన కల్పించవచ్చని, ఆ చిత్రాలు చూసిన తర్వాత అవి తిరిగి సంకేతాలను పంపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’ (Beacon in the Galaxy-BITG) అని పేరు పెట్టారు. అయితే, ఇందులో మనుషుల ఫొటోలను పంపించరు. పురుషుడు, స్త్రీ పూర్తిగా నగ్నంగా ఉన్న బొమ్మలను పంపిస్తారు. చేతులను పైకెత్తి.. ఎలియన్స్‌కు ‘హాయ్’ చెప్పినట్లుగా ఆ బొమ్మలు ఉంటాయి.
Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!
ఈ ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ సందేశంలో నగ్న బొమ్మలనే కాదు, వాటిని కమ్యూనికేట్ చేసేందుకు కొన్ని ఈక్వేషన్లు కూడా వారికి పంపిస్తున్నారు. భూమిపై గల జీవరసాయన సమాచారం, సౌర వ్యవస్థలో భూమి స్థానం తదితర వివరాల గణంకాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. చివరిగా మానవుల(స్త్రీ, పురుషులు) డిజిటలైజ్డ్ చిత్రాలను పంపించి, సందేశాన్ని ముగిస్తారు. ఈ సందేశాన్ని పంపడానికి శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్న కోడ్‌ను బైనరీ కోడ్ అని పిలుస్తారు. బైనరీ అనేది గణితశాస్త్రం సరళమైన రూపం. దీన్ని ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు. మరి, ఎలియెన్స్ ఆ నగ్న సందేశానికి ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ ప్రాజెక్టులకు పెట్టే డబ్బు మరేదైనా మంచి పనికి వాడొచ్చు కదా అని అనిపిస్తోందా? అయితే, ఎలియెన్స్ మనుగడ ద్వారా.. మరే గ్రహం మీదైనా మనుషులు జీవించేందుకు వీలైన వాతావరణం ఉందా, లేదా అని కనుగొనే లక్ష్యంతోనే ఈ ప్రయోగాలు చేస్తున్నారట.
Also Read: వేసవిలో వేడి నీటితో స్నానం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది?