Extramarital Affairs: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..
చలికాలం కాదు, వేసవిలోనే మహిళల్లో కోరికలు ఎక్కువట. అది అక్రమ సంబంధాలకు కూడా దారితీస్తోందని స్వయంగా మహిళలే చెప్పడం గమనార్హం.
Sex In Summer | శృంగారానికి సరైన సీజన్ చలికాలం అని చాలామంది అనుకుంటారు. కానీ, అది కేవలం పురుషులకు మాత్రమే. మహిళలకు మాత్రం వేసవి కాలమే బెస్ట్ సీజన్. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే, మీరు తప్పకుండా ఈ సర్వే గురించి తెలుసుకోవల్సిందే.
వాతావరణం వేడెక్కినప్పుడు మహిళలు సెక్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారని ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా పెళ్లయిన మహిళల్లో లైంగిక కోరికలు పెరుగుతాయని తెలిపింది. కేవలం పెళ్లయిన వ్యక్తుల కోసమే పనిచేసే ఓ యూరప్ డేటింగ్ వెబ్‌సైట్ Gleeden.com నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 71 శాతం మంది వివాహిత మహిళలు వేసవిలో ఎక్కువ సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు.
వాతావరణం వేడెక్కినప్పుడు వారు సెక్స్ గురించి ఎక్కువ ఆలోచించడం ప్రారంభిస్తారని సర్వేలో తేలింది. స్టడీలో భాగంగా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, బెల్జియం, ఇటలీలలో 71 శాతం మంది వివాహిత మహిళలు వేసవిలో ఎక్కువగా సెక్స్ చేస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నారు. చిత్రం ఏమిటంటే.. అవన్నీ అక్రమ సంబంధాలేనట. వేసవిలో భర్తతో కంటే పరాయి పురుషులతోనే ఎక్కువగా కలుస్తామని చెప్పారట.
Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?
దీనిపై సెక్స్ థెరపిస్ట్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది లైంగిక అవసరాలతో ముడిపడి ఉంది. ఆ సీజన్లో వారికి సెక్స్‌ను ప్రేరేపించే హర్మోన్లు రెండింతలు ఎక్కువ పనిచేస్తాయి. అది సెక్స్‌కు ప్రేరేపిస్తుంది. భర్త వల్ల అది సాధ్యం కాకపోతే, పరాయి పురుషుల ద్వారా ఆ కోరికను తీర్చుకొనే ప్రయత్నాలు జరుగుతాయి. భర్తలు ఎక్కువగా తమకు అనుకూలించిన సమయంలోనే సెక్స్‌లో పాల్గొంటారు. కానీ, భార్య అదనపు సెక్స్ కోసం ప్రేరేపించినా, ప్లాన్ చేసినా ఏకీభవించరు. దాని వల్ల వెచ్చటి వాతావరణం.. వారిని వివాహేతర సంబంధం గురించి ఆలోచించేలా చేస్తున్నట్లు సర్వేలో వెల్లడించారు. ఈ విషయాన్ని సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది మహిళలు అంగీకరించారు. తప్పని పరిస్థితుల్లో వేరొకరితో కలుస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వేలో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, బెల్జియం, ఇటలీ దేశాల్లోని 2,406 మంది మహిళలు పాల్గొన్నారు.
Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!
గమనిక: సర్వేలోని అంశాలను యథావిధిగా అందించాం. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.