Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!
వాట్సాప్‌లో మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ దాన్ని కూడా హైడ్ చేసే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ ఉపయోగించే వినియోగదారులకు లాస్ట్ సీన్, ఆన్‌లైన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనం వాట్సాప్‌ని చివరిసారిగా ఎప్పుడు చూశాం, ఆన్‌లైన్‌లో ఉన్నామా లేదా అనే విషయాలు వీటి ద్వారా తెలుసుకోవచ్చు. వీటిలో లాస్ట్ సీన్ స్టేటస్‌ను హైడ్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ గతంలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఆన్‌లైన్‌లో ఉంటే మాత్రం మన చాట్‌లోకి వచ్చిన వారికి ‘ఆన్‌లైన్’ అని కనిపిస్తుంది.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాట్సాప్ దీనిపై కూడా పనిచేస్తుంది. అంటే మీరు వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నా ఆ విషయం అవతలి వారికి తెలీకుండా చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వాట్సాప్ ఫీచర్ల గురించి తెలియజేసే WABetainfo అనే సైట్ తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే... మీరు ఆన్‌లైన్‌లో ఉన్న విషయం మీరు చాట్‌లోకి వచ్చినా అవతలివారికి తెలియదన్న మాట. ఇది బీటా టెస్టర్లకు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి అందరికీ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
వాట్సాప్ వినియోగదారులు ఈ ఫీచర్ కోసం ఎప్పట్నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. తాము ఆన్‌లైన్‌లో ఉన్న సంగతి ఇతరులకు తెలియడం తమ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. వాళ్లకి ఇది కచ్చితంగా గుడ్ న్యూస్. అయితే అందరికీ కాకుండా ఎంపిక చేసిన కాంటాక్ట్స్‌కు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్న సంగతి తెలియకుండా చేయవచ్చు. దాన్ని స్క్రీన్ షాట్లలో కూడా చూడవచ్చు. చూడగానే ఈ ఫీచర్ కావాలనిపిస్తుంది కదా! కానీ కావాలంటే మాత్రం ఇంకొంచెం టైం పడుతుంది.
WhatsApp is working on the ability to hide the online status!
— WABetaInfo (@WABetaInfo) July 1, 2022
WhatsApp is finally listening to user feedback by developing a feature that lets us choose who can see when we are online on WhatsApp!https://t.co/eew9OVi5I1 pic.twitter.com/y3DWfobY3P
@WhatsApp ARE YOU SERIOUS? This is another proof that you're really listening to user feedback... WE WANT THIS FEATURE FOR A LONG TIME... THANK YOU 😭 Please keep working on other amazing features about privacy, security, and messaging!
— WABetaInfo (@WABetaInfo) July 1, 2022
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!