అన్వేషించండి

WhatsApp Features: ఫెస్టివల్ ఆఫర్​ - చిరు వ్యాపారాల కోసం వాట్సాప్​ సరికొత్త ఫీచర్స్​

WhatsApp:భారత్​లో చిరు వ్యాపారుల కోసం వాట్సప్‌ బిజినెస్‌లో పలు కొత్త ఫీచర్లను తాజాగా తీసుకొచ్చింది. వినియోగదారులు నమ్మకమైన సంస్థలను గుర్తించేందుకు వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది.

WhatsApp Business : భారత్​లో చిరు వ్యాపారుల కోసం మెటాకు చెందిన వాట్సప్‌  బిజినెస్‌లో పలు కొత్త ఫీచర్లను తాజాగా తీసుకొచ్చింది. వినియోగదారులు నమ్మకమైన సంస్థలను గుర్తించేందుకు వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది. మరింత మెరుగైన మెసేజింగ్‌ సేవల కోసం A! టూల్స్‌ను చేర్చింది. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం. 

ఈ ప్రపంచంలోనే అత్యధిక మంది వాడే మెసేజింగ్​ యాప్స్​లో వాట్సాప్ ఒకటి. ఈ ఇన్‌స్టెంట్​ మెసేజింగ్ అప్లికేషన్‌  కేవలం ఎంటర్​టైన్మెంట్​, సందేశాల కోసం మాత్రమే కాదు చిరు వ్యాపారుల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇదే సమయంలో తమ యూజర్స్​ను మరింత ఆకర్షించడానికి వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ అప్లికేషన్​​ అందరి కన్నా అగ్ర స్థానంలో కొనసాగుతూ ముందుకెళ్తోంది. 

Also Read: ఐఫోన్ 16 సిరీస్​, వాచ్ సిరీస్ 10 రాకతో ఈ యాపిల్ ప్రొడక్ట్స్​ మాయం!

అయితే తాజాగా దసరా పండగ సీజన్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో మెటాకు చెందిన వాట్సప్‌ బిజినెస్‌లో పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. చిరు వ్యాపారులు, వారి వినియోగదారులతో మరింత మెరుగ్గా అనుసంధానం ​ అయ్యేలా ఈ తాజా ఫీచర్లను అందిస్తోంది.

వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌లో మెటా వెరీఫైడ్, కస్టమైజ్డ్‌ ​ మెసేజ్‌లను తీసుకొచ్చింది. భారత్‌లో చిరు వ్యాపారాల వృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు వీటిని తీసుకొచ్చినట్లు మెటా పేర్కొంది. 

వినియోగదారులు నమ్మకమైన సంస్థలను గుర్తించేందుకు ఈ వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. మరింత మెరుగైన మెసేజింగ్‌ సేవల కోసం కృత్రిమ మేధ టూల్స్‌ను చేర్చింది. వినియోగదారులతో మరింగా మెరుగ్గా ఎంగేజ్​మెంట్​ అయ్యేలా వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌పై కృత్రిమ మేధను యాక్టివేట్‌ చేయనున్నట్లు మెటా తెలిపింది.  ప్రస్తుతం భారత్‌లో ఇది పరీక్షల దశలో ఉంది.  అయితే దీని ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నయని మెటా  వివరించింది. ఇకపై ఈ వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లో  తమ వినియోగదారులకు వ్యక్తిగతంగా సందేశాలు, అపాయింట్‌మెంట్‌ రిమైండర్లు, పుట్టిన రోజు శుభకాంక్షలు, హాలిడే సేల్స్‌ను పంపేలా సదుపాయాన్ని కల్పించింది.   ఒకేసారి అందరికీ ఒకేలా మెసేజులు కాకుండా, వ్యాపారులు​ కస్టమైజ్డ్‌ ​ మెసేజ్‌లను ​ కస్టమర్లకు పంపొచ్చు.

"భారత్​లో వాట్సాప్​ బిజినెస్​ యాప్​ను మిలియన్ల మంది చిరు వ్యాపారులు వినియోగిస్తున్నారు. వారు తమ కస్టమర్లలో మరింత విశ్వాసాన్ని బలపరచుకోవాలని అనుకుంటున్నారు. వారి కోసం ఈ కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొస్తున్నాం. సరైన డిజిటల్​ స్కిల్స్​తో చిరు వ్యాపారులు ఇండియా డిజిటల్ ఎకానమీని సూపర్ చార్జ్​ చేయగలరని మేం నమ్ముతున్నాం. అందుకే మేం చిన్న వ్యాపారులను వాట్సాప్ బిజినెస్ అకౌంట్​ ఎలా సెట్​ చేసుకోవాలి, కేటలాగ్స్​ను ఎలా క్రియేట్​ చేయాలి సహా పలు విషయాలపై అవగాహన కల్పించేలా ట్రైనింగ్​ ఇస్తాం. " అని మెటా పేర్కొంది. కాగా, టైర్​ 2, టైర్ 3 సిటీస్​లో చిన్న వ్యాపారులకు ఈ అవగాహన కల్పించాలని మెటా భావిస్తోంది.

Also Read: ఐఫోన్ 16 సిరిస్​ ప్రీ-ఆర్డర్లు షురూ - ఎలా బుక్​ చేసుకోవాలి, ఆఫర్లు ఏం ఉన్నాయంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Darshan Tickets: ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
Jani Master: జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
Ganesh Immersion: వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Darshan Tickets: ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!
Jani Master: జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
జానీ మాస్టర్ పరారీలో ఉన్నారా? ఫోన్ స్విచాఫ్ - పట్టుకునేందుకు పోలీసులు స్కెచ్!
Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్
Ganesh Immersion: వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
Singer Mano Sons: సింగర్ మనోకు షాక్, ఇద్దరు కొడుకులు అరెస్ట్
సింగర్ మనోకు షాక్, ఇద్దరు కొడుకులు అరెస్ట్
MAD Square First Look: ‘మ్యాడ్’ బాయ్స్ మళ్లీ వచ్చేశారు, పట్టు బట్టల్లో ఫస్ట్‌ లుక్‌ అదిరిందంతే!
‘మ్యాడ్’ బాయ్స్ మళ్లీ వచ్చేశారు, పట్టు బట్టల్లో ఫస్ట్‌ లుక్‌ అదిరిందంతే!
Update For Pensioners: సీనియర్‌ సిటిజన్లు, పెన్షనర్లకు ఇన్ని బెనిఫిట్సా?,- ప్లీజ్‌మిగతావాళ్లు కుళ్లుకోవద్దు!
సీనియర్‌ సిటిజన్లు, పెన్షనర్లకు ఇన్ని బెనిఫిట్సా?,- ప్లీజ్‌మిగతావాళ్లు కుళ్లుకోవద్దు!
Zimbabwe Elephants: ప్రజలకు ఏనుగు మాంసం పంపిణీ - ఏకంగా 200 ఏనుగుల్ని చంపేస్తున్న ప్రభుత్వం!
ప్రజలకు ఏనుగు మాంసం పంపిణీ - ఏకంగా 200 ఏనుగుల్ని చంపేస్తున్న ప్రభుత్వం!
Embed widget