Iphone 16 Series: ఐఫోన్ 16 సిరీస్, వాచ్ సిరీస్ 10 రాకతో ఈ యాపిల్ ప్రొడక్ట్స్ మాయం!
యాపిల్ కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తూ తమ క్యాట్‌లాగ్‌లో కొన్నిటిని నిలిపేస్తుంటుంది. అలా ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్‌తో ఐ ఫోన్13, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను పూర్తిగా నిలిపేవేయనుంది.
Iphone 16 series and Watch series 10 Effect These apple products will discountinue soon : ఐఫోన్ 16 సిరీస్ ఇప్పుడు టెక్ ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. ఎందుకంటే తాజాగా ఈ సిరీస్ ఫోన్‌ను యాపిల్ గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించి లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో నాలుగు మోడళ్లను ఆవిష్కరించింది యాపిల్. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను విడుదల చేసింది. త్వరలో వీటిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది. అలానే ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ ప్రొ 2లను కూడా లాంఛ్ చేసింది. దీంతో ఈ కొత్త ఐఫోన్ మోడళ్లపై రివ్యూలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఈ మోడళ్లు బాగున్నాయంటూ కామెంట్లు చేస్తుండగా, మరి కొంతమంది డిజైన్, ఫీచర్స్ విషయమై సెటైర్లు వేస్తున్నారు.
సరే ఏదేమైనా యాపిల్ ప్రతి ఏడాది తన కొత్త ప్రొడక్టులను తీసుకువస్తూనే, తమ క్యాట్లాగ్లోని కొన్ని పాత ఉత్పత్తులను నిలిపి వేస్తుంటుంది. అలానే మరి కొన్నింటిని కొత్త వాటితో రీ ప్లేస్ చేస్తుంటుంది. అలా ఇప్పుడు తాజాగా ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్‌తో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ గ్యాడ్జెట్‌ను పూర్తిగా ఆపేయనుంది యాపిల్. అలానే యాపిల్ మొదటి సారి పెద్ద స్క్రీన్‌తో విడుదల చేసిన 6.7 ఇంచ్ ఐఫోన్ 14 ప్లస్‌ను కూడా నిలిపి వేయనుంది. గత ఏడాది ఐ ఫోన్ 12ను యాపిల్ తన క్యాట్లాగ్ నుంచి రిమూవ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఐ ఫోన్ 16 సిరీస్ రాకతో ఐ ఫోన్13ను ఆపేయనుంది.
యాపిల్ వాచెస్ - యాపిల్ తాజాగా ఈ ఐఫోన్ 16తో పాటు కొత్త వాచ్ సిరీస్‌ను కూడా ఆవిష్కరించింది. వాచ్ 10 సిరీస్ రావడంతో వాచ్ 9 సిరీస్, ఎస్ఈ 2ను కూడా ఆపేయనుంది ఆపిల్. వాచ్ 10 సిరీస్ కొత్త డిజైన్, పెద్ద డిస్ ప్లేతో పాటు, లైట్ వెయిట్ ప్లాస్టిక్ కేస్‌తో వస్తోంది.
అల్ట్రా 2కు బదులుగా అల్ట్రా 3ను లాంఛ్ చేసింది. ఇందులో కొత్తగా ఎస్ 10 అనే చిప్‌ను అమర్చినట్లు తెలిసింది. ఇందులో ఫిట్నెస్/ హెల్త్ ఫీచర్లు ఉంటాయి. అలానే 2021లో లాంఛ్ చేసిన ఐపాడ్ మినీ 6ను ఐపాడ్ మినీ 7తో రీప్లేస్ చేస్తారని కూడా సమాచారం అందుతోంది. ఇంకా ఆధునిక ఫీచర్లతో ఎయిర్ పాడ్స్ 4ను తీసుకొచ్చింది యాపిల్. దీంతో 2019లో రిలీజ్ చేసిన వైర్ లెస్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ 2ను నిలిపి వేయనుంది. ఇకపోతే 2022లో లాంఛ్ చేసిన యాపిల్ ఐప్యాడ్ 10ను ఆపేసే అవకాశం ఉందట. దీని స్థానంలో కొత్త ఐప్యాడ్ యాపిల్ తీసుకురాబోతున్నట్లు టెక్ వర్గాల సమాచారం.
మొత్తంగా యాపిల్ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ అఫీషియల్‌గా నిలిపివేసినా అవి కొన్ని నెలల పాటు ఆఫ్‌లైన్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటూనే ఉంటాయి. అది కూడా తక్కువ ధరకే లభిస్తాయి. అనంతరం కొంత కాలానికి పూర్తిగా కనుమరుగు అవుతాయి.