(Source: ECI/ABP News/ABP Majha)
Apple iPhone 16: ఐఫోన్ 16 సిరిస్ ప్రీ-ఆర్డర్లు షురూ - ఎలా బుక్ చేసుకోవాలి, ఆఫర్లు ఏం ఉన్నాయంటే?
Apple iPhone 16:తాజాగా ఐఫోన్ ప్రీ ఆర్డర్స్ మొదలైపోయాయి. మరి ఐఫోన్ 16ని ప్రీ-బుకింగ్ ఎలా, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఏంటి? ఈ ఐఫోన్ల ఫీచర్లు, ధరలు వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
Apple iPhone 16: ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ వారం ప్రారంభంలో ఆపిల్ లాంఛ్ ఈవెంట్లో ఆవిష్కరించింది. ఆపిల్ ఇంటెలిజెన్స్, పవర్ఫుల్ A18 చిప్‌సెట్‌తో విడుదల చేసింది. మొత్తంగా ఈ సిరీస్‌లో నాలుగు మోడళ్లను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ను యూజర్స్‌కు అందించింది. అలానే iOS 18 అప్డేట్ను విడుదల చేయనుంది. అయితే తాజాగా ఐఫోన్ ప్రీ ఆర్డర్స్ మొదలైపోయాయి. మరి ఐఫోన్ 16ని ప్రీ-బుకింగ్ ఎలా, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఏంటి? ఈ ఐఫోన్ల ఫీచర్లు, ధరలు వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
ఐఫోన్ 16ని ప్రీ-బుకింగ్ ఎలా, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు - అఫీషియల్‌గా ఈ ఐఫోన్ సేల్స్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. యాపిల్ అధికార వెబ్‌సైట్, యాపిల్ రిటైల్ ఔట్‌లెట్స్‌లోనూ ఈ ఐఫోన్లు దొరుకుతాయి. iPhone 16ని ప్రీ బుకింగ్ యాపిల్ స్టోర్, యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్స్‌లో చేసుకోవచ్చు. iPhone 16 సిరీస్‌ను ప్రీ-బుకింగ్ చేసే యూజర్స్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ ICICI బ్యాంక్ కార్డ్స్‌తో ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ రూ. 5,000 పొందొచ్చు.
iPhone 16 సిరీస్ ధరలు
iPhone 16 128GB ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని మోడళ్లు, వాటి వేరియంట్ ధరలు ఈ కింద విధంగా ఇలా ఉన్నాయి.
iPhone 16 ధర : రూ. 79,900 (128GB); రూ. 89,900 (256GB); రూ. 1,09,900 (512GB). అల్ట్రా మ్యారైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి.
iPhone 16 Plus ధర : రూ. 89,900 (128GB); రూ. 99,900 (256GB); రూ. 1,11,900 (512GB). ఇది కూడా ఐఫోన్ 16 తరహాలో అల్ట్రా మ్యారైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగుల్లో దొరుకుతుంది.
iPhone 16 Pro ధర : రూ. 1,19,900 (128GB); రూ. 1,29,900 (256GB); రూ. 1,49,900 (512GB); రూ. 1,69,900 (1TB). డిసెర్ట్ టిటానియమ్, వైట్ టిటానియమ్, నేచురల్ టిటానియమ్, బ్లాక్ టిటానియమ్ ప్రీమియమ్ ఫినిషెస్లో లభిస్తోంది.
iPhone 16 Pro Max ధర : రూ. 1,44,900 (256GB); రూ. 1,64,900 (512GB); రూ. 1,84,900 (1TB). ఇది కూడా ఐఫోన్ 16 ప్రో తరహాలో డిసెర్ట్ టిటానియమ్, వైట్ టిటానియమ్, నేచురల్ టిటానియమ్, బ్లాక్ టిటానియమ్ ప్రీమియమ్ ఫినిషెస్లో లభిస్తోంది.
Also Read: Iphone 16పై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు - రివ్యూస్ ఎలా ఉన్నాయంటే?
iPhone 16 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్స్
ఐఫోన్ 16 6.1అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. డ్యుయెల్ కెమెరా సెటప్ కూడా ఉంది.
రెండు సైడ్ బటన్లు : కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను ఈ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌కు అమర్చారు. కెమెరా కంట్రోల్ బటన్‌తో విజువల్ ఇంటెలిజెన్స్‌తో మాక్రో ఫొటోలు, స్పేషియల్ ఫొటోలు/వీడియోలు తీయొచ్చు.
ఐఫోన్ 16లో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ సెన్సార్, డాల్బీ విజన్, 4కే వీడియోలు తీసుకోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్‌లో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ సెన్సార్ ఉంది. మొత్తంగా ఈ రెండు ఫోన్లతో డాల్బీ విజన్‌లో 4కే60 వీడియోను తీయోచ్చు. వీడియోల్లో ఎయిర్ సౌండ్‌ను కూడా తగ్గించొచ్చు.
iPhone 16 ప్రొ, iPhone 16 ప్రొ మ్యాక్స్
16 ప్రో మోడల్ 6.3-అంగుళాల ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, IP 68 రేటింగ్‌ను కలిగి ఉంది. 48 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 48 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ టెలిఫొటో కెమెరా ఉంది.
ప్రో మాక్స్ 6.9-అంగుళాల ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. దీనిలో కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, IP 68 రేటింగ్‌ను కలిగి ఉంది. కెమెరా ఐఫోన్ 16 ప్రో తరహాలోనే ఉంది.
Also Read: ఐఫోన్ 16 సిరీస్, వాచ్ సిరీస్ 10 రాకతో ఈ యాపిల్ ప్రొడక్ట్స్ మాయం!