అన్వేషించండి

Iphone 16పై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు - రివ్యూస్​ ఎలా ఉన్నాయంటే?

Iphone 16 Mixed Reviews: యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది. యాపిల్ ఈవెంట్‌లో సరికొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ పై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి.

Funny Memes and Jokes iPhone 16 series: ఐఫోన్ లవర్స్​ అందరూ ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 16 ఫోన్లు ఎట్టకేలకు వచ్చేశాయి.  యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో ఇవి రూపొందినట్లు కంపెనీ తెలిపింది. అధునాతన కెమెరా కంట్రోల్‌ ఫీచర్​తో పాటు కొత్త బటన్లు ఈ ఫోన్లలో అమర్చడం విశేషం. అలానే  ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్‌ ఏ18తో ఇది వచ్చింది. 

ఇంకా ఈ ఐఫోన్‌ 16 మోడళ్లతో(ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్, ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ 16 ప్రొ మ్యాక్స్‌) పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, వాచ్‌ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్‌ 4,  ఎయిర్‌పాడ్స్‌ ప్రొ 2లను కూడా విడుదల చేసింది కంపెనీ.'ఇట్స్‌ గ్లోటైమ్‌' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ గ్యాడ్జెట్స్​ను ఆవిష్కరించింది. 

ఈ ఫోన్లను ఆవిష్కరించగానే వీటిపై రివ్యూలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. యూజర్స్ ఈ ఫోన్ల ఫీచర్స్​, డిజైన్ ఎలా ఉందో చెబుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ ఐఫోన్ 16 మిక్స్​డ్​ రివ్యూస్​ను అందుకుంది. కొంతమంది ఈ ఫోన్లు అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు చేస్తుండగా, మరి కొంతమంది నెట్టింట్లో నెగటివ్ రివ్యూస్​ ఇస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్​పై మీమ్స్​తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 

Iphone 16 Social Media Memes : 'ఐఫోన్ 11, 12, 13, 14,15, XS అన్నీ ఒకేలా ఉన్నా'యంటూ స్పైడర్ మ్యాన్ సిరీస్​ పిక్స్​తో పోల్చారు ఓ యూజర్.  "మేము ఈ ఏడాది కొత్త జనరేషన్​ ఫోన్​ను కొనాలనుకున్నాం. బిగ్గెస్ట్ డిస్​ ప్లే, థిన్ డిజైన్ కాదు." అని మరో యూజర్ కామెంట్​ చేశారు. "యాపిల్ ఎప్పుడు మళ్లీ మళ్లీ సేమ్ ప్రొడక్ట్​ మాత్రమే విడుదల చేస్తుంది. తమ కస్టమర్స్​ను మళ్లీ మళ్లీ అదే కొనేలా చేస్తూ ఉంటుంది.", "కెమెరా బట్​ను నన్ను ఉలిక్కిపడేలా చేసింది.",  "ఈ ఐఫోన్ 16 నన్ను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.",  "కేవలం పేరు, ఏడాది మాత్రమే మారింది. అంతా ఒకేలా ఉంది.", "కేవలం సెపరేట్ కెమెరా బటన్​ కోసం యాపిల్​ మళ్లీ కొత్తగా ఫోన్​ను లాంఛ్ చేసింది. నైస్​.", "ఐఫోన్ 16 ప్రో ఇంకా వన్​ ప్లస్​ నోర్డ్​ను బీట్​ చేయలేకపోతోంది." అంటూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. 

IPhone 16 Prices : ఇకపోతే యాపిల్‌  లాంఛ్​ చేసిన ఈ ఐఫోన్‌ 16 ధర రూ.79 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఐఫోన్‌ 16 ప్లస్‌ రూ.89,900 నుంచి అందుబాటులో ఉంది.  ఐఫోన్‌ 16 ప్రో రూ.1.19 లక్షలుగా ఉంది. ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1.44 లక్షల నుంచి అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఫోన్లన్నీ సెప్టెంబర్‌ 13 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.  సెప్టెంబర్‌ 20 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. కాగా, యాపిల్ ప్రతి ఏడాది తన కొత్త ప్రొడెక్ట్స్​ను లాంఛ్​ చేయగానే పాత ప్రొడక్ట్స్​ ధరలను తగ్గించి, కొన్నింటిని నిలిపివేస్తుంటుంది. అలానే ఈ సారి కూడా చేసింది.

Also Read: అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అయిన iPhone 16 Pro- బిగ్‌ స్క్రీన్, స్పెషల్ కెమెరా ఫీచర్స్‌ ఉన్న ఈ ఫోన్ ధర ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget