అన్వేషించండి

iphone 16-pro Features And Price: అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అయిన iPhone 16 Pro- బిగ్‌ స్క్రీన్, స్పెషల్ కెమెరా ఫీచర్స్‌ ఉన్న ఈ ఫోన్ ధర ఎంతంటే?

Apple Event 2024:ఆపిల్ కొత్త ఫోన్ ఐఫోన్ 16 ప్రోను విడుదల చేసింది. ఈ ఐఫోన్‌లో కంపెనీ అనేక కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. కొత్త ఐఫోన్ ఫీచర్లు ధర గురించి ఇక్కడ తెలుసుకోండి.

iphone 16-pro Launched : ఆపిల్ ఈవెంట్‌ 2024 చాలా గ్రాండ్‌గా జరిగింది. Apple 'Glowtime' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆపిల్ తాను తయారు చేసిన చాలా ప్రొడెక్ట్స్‌ను ప్రజలకు పరిచయం చేసింది. ఇవి ఎన్ని ఉ్నప్పటికీ ఐఫోన్ కొత్త సిరీస్‌పై అందరి దృష్టి ఉంది. కొత్తగా తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్‌ ఏంటీ... ఇండియాలో రేట్ ఎంత అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడొచ్చు. 
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్‌ను ఆపిల్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఆపిల్‌ చాలా ఐఫోన్‌లు విడుదల చేసింది. ఆ ఐఫోన్‌లలో ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్‌ ఫోన్‌ పేరు iPhone 16 Pro. చాలా రోజు నుంచి ఈ కొత్త సిరీస్‌ఐఫోన్ గురించి చర్చ జరుగుతోంది.

ఈసారి Apple తన iPhone Pro మోడల్‌లో స్క్రీన్ సైజ్‌, కెమెరా నాణ్యతపై ఫోకస్ చేసింది. మార్పులతో  iPhone 16 Pro తీసుకొచ్చింది. ఈ స్టోరీలో ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం. 

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: ఐఫోన్ 16 ప్రోలో 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్, ట్రూ టోన్, పి3 వైడ్ కలర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు అందిస్తోంది ఆపిల్‌ సంస్థ. 

ప్రోసెసర్: ఈ ఫోన్‌లోని ప్రోసెసర్ కోసం Apple A18 Pro చిప్‌సెట్ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఇదే అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ అని ఆపిల్ ఈ ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది. 

సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ iOS 18 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో రన్ iPhone 16 Pro పని చేస్తుంది. 

ర్యామ్‌: iPhone 16 Pro ఫోన్ 8GB ర్యామ్‌తో వస్తుంది.

స్టోరేజ్: iPhone 16 Pro ఫోన్ 12GB RAM, 256GB RAM, 512GB స్టోరేజ్‌తో లాంచ్ చేశారు. 

బ్యాక్ కెమెరా: OIS సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా iPhone 16 Pro ఫోన్‌లో 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ కూడా ఉంది. ఇది ఆటో ఫోకస్ ఫీచర్‌తో వస్తున్నట్టు ఆపిల్ పేర్కొంది. ఈ ఫోన్‌కు వెనక మూడో కెమెరా 12MP ఉంది. ఇది. 5x టెలిఫోటో లెన్స్‌తో పని చేస్తుంది. 

ఫ్రంట్ కెమెరా: సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా అందిస్తోంది. 

బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్: iPhone 16 Proఫోన్‌లో Li-ion, MagSafe, Qi2, Qi వైర్‌లెస్ ఛార్జింగ్,  USB టైప్-C వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఇతర ఫీచర్లు: యాక్షన్ బటన్, యాపిల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఫోటోగ్రఫీ ఫిల్టర్లు, ప్రోరేస్ లాగ్, కెమెరా కంట్రోల్ బటన్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు iPhone 16 Pro ఫోన్‌లో ఉన్నాయి.

కలర్స్‌: ఆపిల్‌ కంపెనీ iPhone 16 Pro ఫోన్‌ని మొత్తం 4 రంగులలో లాంచ్ చేసింది - ముదురు నలుపు, బ్రైట్ వైట్, నేచురల్ టైటానియం, డెసర్ట్ టైటానియం రంగులు.

ధర: ఈ ఫోన్ ధర 999 US డాలర్లు (దాదాపు రూ. 84,000). 

అమ్మకాలు : ఈ ఫోన్ కోసం సెప్టెంబర్ 13 నుంచి ప్రీ-ఆర్డర్‌లు తీసుకుంటారు. సెప్టెంబర్ 20 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తారు. 

అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్ iPhone 16 Pro ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది
ఆపిల్ iPhone 16 Pro మోడల్స్‌లో A18 ప్రో చిప్‌సెట్‌ను ఇచ్చింది, ఇది పనితీరు పరంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఇదే అత్యంత శక్తివంతమైన ప్రోసెసర్ అని కంపెనీ పేర్కొంది. ఇది 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో వస్తుందని తెలిపిరంది. దీని వల్ల AI వర్క్‌లోడ్‌లు మంచి బూస్టప్‌గా పని చేస్తుందని చెప్పుకొచ్చింది. 

iPhone 16 Proలో మెమరీ బ్యాండ్‌విడ్త్ కూడా పెరిగింది. దాని మునుపటి ప్రాసెసర్‌లతో పోలిస్తే ఇది ట్రిపుల్-A గేమ్‌ను స్పీడప్ చేస్తుంది. కంపెనీ చెప్పినదాని ప్రకారం ఇందులో iPhone 16 Proలోని కొత్త CPU A17 కంటే 15 శాతం ఎక్కువ వేగంగా ఉంటుంది.

అద్భుతమైన కెమెరా ఫీచర్లు

కెమెరా: iPhone 16 Proలో 48MP ప్రధాన కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 5x టెలిఫోటో కెమెరా,  బేస్ మోడల్‌లో కనిపించే కెమెరా కంట్రోల్ ఫీచర్ కూడా అందిస్తోంది. 

కెమెరా కంట్రోల్: iPhone 16 Proలో వర్చువల్ కంట్రోల్ ప్యాడ్ ఉంది, ఇది వినియోగదారులకు త్వరగా కలర్ గ్రేడింగ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. 

వీడియో: iPhone 16 Proతో 4K/120fpsలో వీడియోలి షూట్ చేయవచ్చు. ఆ తర్వాత ఎడిట్‌ చేసి FPS రేట్స్‌కు వీడియోను సెట్‌ చేసుకోవచ్చు. ఆపిల్ వీడియో రికార్డింగ్ టైంలో స్పేషియల్ ఆడియో క్యాప్చర్‌ని కూడా ఎనేబుల్ చేస్తోంది.

ఆడియో: కొత్త ఆడియో ఫీచర్‌తో వేర్వేరు వ్యక్తుల ఆడియోను ఒకేసారి రికార్డు చేసినా వాయిస్‌లను వేరు చేయగలదు, రికార్డ్ చేసిన వీడియోలతో ఆడియోను మిక్స్‌ చేయడానికి కూడా అనేక మోడ్‌లు ఉన్నాయి. అప్‌గ్రేడ్ చేసిన వాయిస్ మెమోస్ ఫీచర్ ద్వారా మ్యూజిక్‌ ఆర్టిస్టులు మరింత సులభంగా లేయర్ ట్రాక్‌లు లేదా ఇన్‌స్ట్రుమెంటల్‌ల నుంచి వోకల్ ట్రాక్‌లను వేరు చేయవచ్చు.

Also Read: ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్ ఫీచర్‌తో వచ్చిన కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ధర మామూలుగా లేదు!

Also Read: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్​ కెమెరా ఫీచర్స్ ఇవే - క్లిక్ చేశారంటే హై క్వాలిటీనే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget