అన్వేషించండి

iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్​ కెమెరా ఫీచర్స్ ఇవే - క్లిక్ చేశారంటే హై క్వాలిటీనే!

ఐఫోన్​ను సెక్యూరిటీ కోసం కొంటారన్న సంగతి తెలిసిందే. అలానే దీంతో పాటు ముఖ్యంగా చూసేది కెమెరా. అయితే ఐఫోన్ 16 ప్రోలో కెమెరా ఫీచర్లలో మరిన్ని అప్ డేట్స్ తో రాబోతున్నాయి. అవి ఏంటో చూద్దాం.

iPhone 16 Pro camera Specifications : యాపిల్  ఐఫోన్  అనగానే టక్కున ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట ధరెంత? దాని  ఫీచర్ల గురించి తెలుకునే వారికన్నా ఫోన్ ధరెంత అని అడిగేవారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఐఫోన్ అనగానే అందులే ఉండే ఫీచర్లు అన్నీ అత్యుత్తమంగా ఉంటాయనే నమ్మకం యూజర్స్​లో ఉంటది. మనం గమనిస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌ ఫీచర్ల గురించి తెలిపినంతగా,  ఐఫోన్‌ ఫీచర్ల గురించి యాపిల్ ఎక్కువగా ప్రస్తావించదు. అలానే ఐఫోన్లలో ఉపయోగించే టెక్నాలజీ, ఇతర ముఖ్యమైన విడి భాగాల గురించి కూడా ప్రైవసీని పాటిస్తుంటుంది. 

అయితే ఎక్కువ మంది ఈ ఐఫోన్​ను సెక్యూరుటీ కోసం కొంటారన్న సంగతి తెలిసిందే. అలానే దీంతో పాటు ముఖ్యంగా చూసేది దాని కెమెరా.  సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లలో 64 ఎంపీ, 108ఎంపీ కెమెరాలు ఇచ్చినా, ఐఫోన్‌లో మాత్రం 12 ఎంపీ కెమెరాలు మాత్రమే కనిపిస్తుంటాయి.  కానీ, ఫొటోల నాణ్యతలో ఇతర ఫోన్లతో పోల్చి చూస్తే ఐఫోన్‌తో తీసిన ఫొటోలే మెరుగ్గా, స్పష్టతగా కనిపిస్తాయి. అందుకు ప్రధాన కారణం ఐఫోన్ కెమెరాల్లో వినియోగించే సెన్సర్లే. 

లాంచ్ డేట్ అప్పుడే -  అయితే ఇప్పుడు యాపిల్​ యూజర్లంతా  ఐఫోన్​ 16 సిరీస్​ ఎప్పుడెప్పుడు లాంఛ్​​ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఓ సూపర్​  క్రేజీ అప్డేట్ వచ్చింది​. యాపిల్ తన లాంఛ్ ఈవెంట్​కు సంబంధించి "ఇట్స్ గ్లోటైమ్" అన్న థీమ్​ను అనౌన్స్ చేసేసింది.  ఐఫోన్ 16 సిరీస్​ సెప్టెంబర్ 9న లాంఛ్​ కానుందని తెలిపింది. ఈ ఈవెంట్​ యాపిల్ పార్క్ నుంచి ఉదయం 10 గంటలకు  ప్రసారం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం చూస్తే సెప్టెంబర్ 9, 2024 రాత్రి 10:30 గంటలకు ఈ ఈవెంట్​ లైవ్ అవుతుందనమాట. ఈ ఈవెంట్ యూట్యూబ్, యాపిల్ ఈవెంట్ ప్లాట్​ఫామ్​లలోనూ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. 

అయితే ఈ ఐఫోన్ 16 సిరీస్​ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి రకరకాల రూమర్స్​, లీక్స్​ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐ ఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్​ కెమెరా ఫీచర్ల, అపగ్రేడ్స్​ గురించి కొన్ని వివరాలు లీక్​ అయ్యాయి. 

ఐ ఫోన్ 16 ప్రో కెమెరా స్పెసిఫికేషన్స్(అంచనా) - ఐ ఫోన్ 16 ప్రో రెండు మేజర్ అప్​గ్రేడ్స్​తో రానున్నట్లు తెలిసింది. టెక్ రేడర్ రిపోర్ట్​ ప్రకారం ఐ ఫోన్ 16 ప్రోలో అల్ట్రా వైడ్​ కెమెరా సెన్సార్​ ఉందట. 12 మెగా పిక్సల్​ నుంచి 48 మెగా పిక్సల్​ వరకు అపగ్రేడడ్ అవుతుందట. ఈ అల్ట్రా వైడ్​ కెమెరా సెన్సార్ సైజ్​ కూడా  1/2.6 ఇంచ్​ కూడా పెరుగుతుందట. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ లైట్​ అట్రాక్ట్ చేయడంతో పాటు కాప్చర్ చేసిన ఫొటోస్​ను ఎంతో క్లారిటీగా చూపిస్తుంది. 
మరో అప్​గ్రేడ్ ఏంటంటే ఈ ఐఫోన్ 16 ప్రోలో కొత్త టెలిఫొటో లెన్స్​ను అమర్చారని తెలుస్తోంది. 5x ఆప్టికల్ జూమ్​ సామర్థ్యంతో ఇది రానుందట. ఈ కొత్త లెన్స్​...  ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్​లో ఉన్న కెమెరానే అని తెలుస్తోంది. 

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్​ కెమెరా స్పెసిఫికేషన్స్​(అంచనా​) - ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్​లో కొత్త కెమెరా సెన్సార్​ను అమర్చారట. 48 మెగా పిక్సల్​ రిసొల్యూషన్​తో రానుంది. అలానే సెన్సార్ సైజ్​ను 1/1.14 ఇంచ్​కు అప్​గ్రేడ్​ చేశారట. ఇమేజెస్​లో డిస్టోర్షన్​ను రెడ్యూస్​ చేసేందుకు కొత్త లెన్స్​ను కూడా అమర్చారని తెలిసింది. ఇంకా ఈ 16 ప్రో మ్యాక్స్​కు అప్​గ్రేడెడ్​ 48 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్​ కెమెరా ఉందట. ఇంకా టెట్రాప్రిజమ్​ లెన్స్ కలిగిన కొత్త సూపర్ టెలిఫొటో కెమెరా కూడా ఉందని తెలిసింది. దీనికి 5x నుంచి 10x జూమింగ్ కెపబిల్టీ కూడా ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget