అన్వేషించండి

Vivo Y300 Plus: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన వివో - వావ్ అనిపించే కెమెరాలతో!

Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వై300 ప్లస్. దీని ధరను రూ.23,999గా నిర్ణయించారు. 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ అయింది.

Vivo Y300 Plus Launched: వివో వై300 ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ మిడ్ రేంజ్ వై సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ కొత్త వివో హ్యాండ్ సెట్ రెండు కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.78 అంగుళాల 3డీ కర్వ్‌డ్ స్క్రీన్ అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు.

వివో వై300 ప్లస్ ధర (Vivo Y300 Plus Price in India)
ఈ ఫోన్‌లో కేవలం ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. సిల్క్ గ్రీన్, సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఈ స్టోర్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

వివో వై300 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo Y300 Plus Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో వై300 ప్లస్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 6ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో ఇది మార్కెట్లోకి రానుంది. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, ఓటీజీ, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయవచ్చు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 183 గ్రాములుగా ఉంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట -  ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
Daggubati Suresh Babu: టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్పీవీ నరసింహా రావుకి రతన్‌ టాటా లెటర్, వైరల్ అవుతున్న లేఖMaoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - ఆకస్మిక వరదలకు అవకాశం
Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట -  ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు
Daggubati Suresh Babu: టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
టికెట్ ధరల పెంపుతో సినిమాలకు ప్రేక్షకులు దూరం - నిర్మాత సురేష్ బాబు ఏమన్నారు?
Sajjala Ramakrishna Reddy Notice : టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జలకు నోటీసులు- రేపు విచారణకు రావాలని పోలీసులు ఆదేశం 
Akhanda 2 : చిన్న కుమార్తె స్విచ్ ఆన్ - పెద్ద కుమార్తె క్లాప్ - బాలయ్య ' అఖండ 2' తాండవం షురూ 
చిన్న కుమార్తె స్విచ్ ఆన్ - పెద్ద కుమార్తె క్లాప్ - బాలయ్య ' అఖండ 2' తాండవం షురూ 
Vivo Y300 Plus: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన వివో - వావ్ అనిపించే కెమెరాలతో!
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన వివో - వావ్ అనిపించే కెమెరాలతో!
Telangana News : ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
DA Hike: దీపావళి కానుక - ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగిందోచ్‌
దీపావళి కానుక - ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగిందోచ్‌
Embed widget