విశ్వంలో అతిపెద్ద బ్లాక్ హోల్ ఏది? ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్ హోల్ పేరు టన్ 618. ఇది క్వాసార్ అనే ప్రాంతంలో ఉంది. దాదాపు 66 బిలియన్ల సూర్యుల ద్రవ్యరాశి దీనికి సమానం. భూమి నుంచి 10.4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది. దీన్ని సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అని కూడా ఉంటారు. క్వాసార్ అనేది ఎంతో ప్రకాశవంతమైన ప్రదేశం. బ్లాక్ హోల్ చుట్టూ వాయువులు, ధూళితో ఇది ఏర్పడింది. దీని గురుత్వాకర్షణ శక్తి ఎంత బలమైనది అంటే కాంతిని కూడా తనలోకి లాగేస్తుంది. రేడియో టెలిస్కోపులతో శాస్త్రవేత్తలు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. విశ్వాన్ని అర్థం చేసుకోవడం బ్లాక్ హోల్ కీలక పాత్ర పోషిస్తుంది.