Tecno Spark 8T: రూ.9 వేలలోపే కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ స్పార్క్ 8టీని మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.8,999గా ఉండనుంది.
టెక్నో స్పార్క్ 8టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో వచ్చిన టెక్నో స్పార్క్ 8కు కొన్ని అప్‌గ్రేడ్స్ చేసి ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్లు చూసుకుంటే.. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 8టీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. అట్లాంటిక్ బ్లూ, కోకో గోల్డ్, ఐరిస్ పర్పుల్, టర్కోయిస్ సియాన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ అమెజాన్‌లో ఇప్పటికే ప్రారంభం అయింది.
టెక్నో స్పార్క్ 8టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 91.3 శాతంగా ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ35 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉండనుంది. ఏఐ బ్యూటీ, ఏఐ యానిమోజీ, గూగుల్ లెన్స్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, స్మార్ట్ పొర్‌ట్రెయిట్, వీడియో బొకే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, జీ-సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆప్టిమైజింగ్ పవర్ సేవింగ్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే.. 38 రోజుల స్టాండ్‌బై టైం, 122 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. 40 గంటల కాలింగ్ టైంను ఇది అందించనుందని సమాచారం. దీని మందం 0.88 సెంటీమీటర్లుగా ఉంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!