Tecno Spark 8: రూ.11 వేలలో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ స్పార్క్ 8లో లేటెస్ట్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 8 మొబైల్‌లో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీని ధర రూ.10,999గా ఉంది. ఈ ఫోన్ మొదట 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలోనే లాంచ్ అయింది. వీటి ధర రూ.7,999, రూ.9,299గా ఉంది.
ఈ ఫోన్ కొనుగోలుపై పలు లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ.799 విలువైన బ్లూటూత్ ఇయర్‌పీస్, వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఈ ఫోన్‌తో పాటు అందించనున్నారు. ఈ ఫోన్ మనదేశంలో రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.
టెక్నో స్పార్క్ 8 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1600 పిక్సెల్స్‌గా ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు క్యూవీజీఏ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!