New Smartphone: కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.ఐదు వేలలోపే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 5పీ.
టెక్నో పాప్ 5సీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 2400 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫోన్ వెనకవైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 16 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఈ సంవత్సరం ఆగస్టులో టెక్నో పాప్ 5పీ కూడా లాంచ్ అయింది.
టెక్నో పాప్ 5సీ ధర ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఫోన్ కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. లేక్ బ్లూ, డార్క్ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే రూ.3,000 నుంచి రూ.5,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.
టెక్నో పాప్ 5సీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఐదు అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. దీని ప్రాసెసర్ వివరాలు తెలియరాలేదు. 1 జీబీ ర్యామ్‌ను ఇందులో కంపెనీ అందించింది. 16 జీబీ స్టోరేజ్‌ను కూడా అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 5 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ ఫేస్ బ్యూటీ, హెచ్‌డీఆర్, స్మైల్ షిట్, ఏఐ స్టిక్కర్, బొకే మోడ్ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 2400 ఎంఏహెచ్‌గా ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను ఇందులో అందించారు.
దీని మందం 0.98 సెంటీమీటర్లు కాగా, బరువు 150 గ్రాములు మాత్రమే. జీ-సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ4.2, వైఫై, జీపీఎస్, జీఎస్ఎం, నానో సిమ్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, జీపీఆర్ఎస్, ఎఫ్ఎం వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
టెక్నో పాప్ 5సీ రిటైల్ బాక్స్‌లో చార్జర్, ప్రొటెక్టివ్ షెల్, చార్జింగ్ కేబుల్, హెడ్ సెట్ ఉండనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు కూడా ఇంకా తెలియరాలేదు.
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!